ఉరకలేస్తున్న కృష్ణమ్మ
కర్ణాటక ప్రాంతంలో కురుస్తు న్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరేతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తడంతో జూరాలకు 67వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి.
- జూరాలకు భారీ వరద
- 5.882 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
- తుంగభద్ర డ్యాంలో 59.056 టీఎంసీల నీటి నిల్వ
- ర్యాలంపాడు @1.18టీఎంసీలు
గద్వాల, జూలై 19 : కర్ణాటక ప్రాంతంలో కురుస్తు న్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరేతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తడంతో జూరాలకు 67వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం 316.880 అడుగులుగా ఉన్నది. జూ రాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్ర స్తుతం 6.523 టీఎంసీలుగా నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టుకు 67వేల ఇన్‌ఫ్లో న మోదు కాగా అందులో పవర్ జనరేషన్ కోసం 34, 818, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు- 1,500, భీమాలిఫ్ట్-1కు 1,300, భీమా లిఫ్ట్-2కు 750, జూరాల ఎడమ కాల్వ కు 870, కుడి కాల్వకు 367, ప్యారలాల్ కాల్వకు 600, మొత్తం 39,533 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచి కృష్ణానది కి భారీగా వరద వస్తుండడంతో నదీ పరీవాహక ప్రాం తాల వారు అప్రమత్తంగా ఉండాలని, చేపలు పట్టేందు కు నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
జూరాలకు పరుగులు..
మక్తల్, జూలై 19 : కృష్ణానదికి ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శుక్రవారం జూరాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. మక్తల్ మండలంలోని వల్లభాపురం దత్తక్షేత్రం మీదుగా ఉరకలేస్తున్న కృష్ణమ్మను తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
కొనసాగుతున్న ప్రవాహం
గట్టు, జూలై 19 : నెట్టెంపాడు పథకంలో భాగమైన ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీటి ప్ర వాహం కొనసాగుతున్నది. శుక్రవారం నాటికి రిజర్యాయర్లో నీటి నిల్వ 1.18 టీఎంసీలుగా ఉంది. 1,200 క్యూసెక్కుల వరద రిజర్యాయర్‌లోకి వస్తున్నది. రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ(104ప్యాకేజీ)కు 203 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా కుడి కాల్వ 398 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
కాగా ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4టీఎంసీలు ఉండగా, కట్ట బలహీనంగా ఉండడంతో నీటి నిల్వను 2టీఎంసీల లోపే చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి గట్టుకు వచ్చే కాల్వ ప్రవాహం గొర్లఖాన్‌దొడ్డి శి వారు వద్దే ఆగిపోయింది. ఆ ప్రాంతంలో కల్వర్టు ని ర్మాణం పనుల్లో కాల్వలో మట్టి కూరుకుపోయింది. అధికారులు మట్టిని తొలగించకపోవడం తో నీరురాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరినార్లు చేతికొచ్చాయని, మ ట్టిని తొలగించి కాల్వలో నీరు ఎప్పటి మాదిరిగానే పారే విధంగా చూడాలని గొర్లఖాన్‌దొడ్డి, గట్టు, మాచర్ల, బలిగేర రైతులు కోరుతున్నారు.
టీబీ డ్యాంకు లక్షకు పైగా ఇన్‌ఫ్లో..
అయిజ, జూలై 19 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. తుంగ నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో టీబీ డ్యాంలో వరద పొంగి ప్రవహిస్తున్నది. శుక్రవారం ఇన్‌ఫ్లో 1,08,326 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,180 క్యూసెక్కులుగా నమోదైంది. తుం గభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులకు గానూ ప్రస్తుతం 1619.18 అడుగులు ఉన్న ది. డ్యాం గరిష్ఠ నీటినిల్వతో 105.788 సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 59.056 టీఎంసీల నీటిమట్టానికి చేరుకున్నది. ఎగువన మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

