వెల్దండ : పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం ఉత్తముని లక్షణమని, యుద్ధ విద్య కరాటే( Karate) ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని మాంక్స్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, కరాటే మాస్టర్ నీరటి కుమార్ అన్నారు.
ఆదివారం నాగర్ కర్నూల్( Nagarkurnool ) జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో కరాటే మాస్టర్ నీరటి కుమార్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన పవన్, అఖిరా, జత్విన్ , వసంత్ కుమార్, రిత్విక్ గౌడ్, ఆరాధ్యకు ఆరెంజ్ బెల్టులు అందజేయగా నవ్య, యశశ్విత, ప్రణయ్ ,శశాంక్ , నితీష్, విద్యాదిత్య, మహతిలకు గ్రీన్ బెల్టులు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మాస్టర్ కుమార్ తన సొంత ఖర్చులతో పురిటి గడ్డ ఋణం తీర్చుకునే దిశగా ఉచితంగా కరాటే నేర్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నాగేష్ గౌడ్, విద్యార్థులు ఉన్నారు.