యవత మత్తును వీడాలి
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మాదక ద్రవ్యాల వి నియోగంతో జీవితం నాశనం చేసుకోవద్దని, యువత మాదక ద్రవ్యాల బారినపడకుండా దూరంగా ఉండాలని అన్నారు.
- మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి
- పాలమూరులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ
మహబూబ్‌నగర్, జూలై 26: మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మాదక ద్రవ్యాల వి నియోగంతో జీవితం నాశనం చేసుకోవద్దని, యువత మాదక ద్రవ్యాల బారినపడకుండా దూరంగా ఉండాలని అన్నారు. బుధవారం ఆంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సం దర్భంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ కూడలి వరకు కలెక్టర్, ఎస్పీ జానకి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెల ంగాణ కూడలిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్య తిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం చాపకింద నీ రు లా విస్తరిస్తున్నదని, పిల్లలు, యువతను లక్ష్యం చే సు కొని కొందరు దందా చేస్తున్నారని అన్నారు. మాదక ద్ర వ్యాల బారినపడి యువత జీవితాన్ని, భవిష్యత్‌ను నా శనం చేసుకోవద్దన్నారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యా ల సరఫరా, వినియోగంపై పోలీసులకు సమాచారం అం దించాలన్నారు.
పోలీసుశాఖ మాదక ద్రవ్యాల వి ని యోగం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. అనంతరం ఎస్పీ జానకి మాట్లాడుతూ మా దకద్రవ్యాల వినియోగం, రవాణా ప్రమాదకరంగా మా రిందన్నారు. ఈ విషయంలో పోలీసులు కఠినంగా వ్య వహరిస్తారన్నారు. ఈ కేసు నమోదైతే పదేండ్ల శిక్ష లేక జీ వితఖైదు కూడా పడే అవకాశం ఉందన్నారు. అ లాగే గం జాయి అమ్ముతున్నట్లు తెలిస్తే ప్రజలు డయల్ 100కి గానీ, జిల్లా కంట్రోల్ రూం నెంబర్ 87126 59360కు లేదా దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరిస్తేనే అరికట్ట గలమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆ నంద్గౌడ్, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఎక్సైజ్ శాఖ ఆసిస్టెంట్ కమిషనర్ విజయ్ భాస్కర్‌రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరినాబేగం, క్రీడాశాఖల అధికా రి శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాములు, ఏఆర్ ఏఎస్పీ సురేశ్‌కుమార్, సీఐ అప్పయ్య, రెడ్‌క్రాస్ చైర్మన్ నట రా జ్, ఇతర సిబ్బంది పాల్గ్గొన్నారు.
బాలకార్మికులను గుర్తించాలి..
మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 26: ఆకస్మిక తనిఖీలతో బాలకార్మికులను గుర్తించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మహబూబ్‌నగర్ సమీకృత క లెక్టరేట్ కార్యాలయంలో బాలకార్మికులు, కౌమార బాలకార్మికులపై జిల్లాస్థాయి టాస్పోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. మండలస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారులు సమన్వయంలో తనిఖీలు చేయాలన్నారు. జూలై 1నుంచి 31 వరకు వివిధ శాఖలు సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి తప్పిపోయిన, నిరాదరణకు గురైన, పనిలో ఉన్న బాలకార్మికులను గుర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు బాబురావు, కార్మిక శాఖ సహ కమిషనర్ స్వామి, డీఆర్డీవో నర్సింహులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి పాండు, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రూనాయక్ పాల్గ్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ..
త్రైమాసిక తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టర్ విజయేందిర బోయి కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించారు. రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షం లో సీల్ తీసి లోపల ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్లను క్షు ణ్ణంగా తనిఖీ చేశారు. తిరిగి సీల్ వేశారు. అనంతరం ఆ మె మాట్లాడుతూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ అనుమతించరాదని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీవో నవీన్, ఎన్నికల డీ టీ జాఫర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గ్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

