‘పది’లో బాలికలదే హవా
పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో రాష్ట్రంలోనే నారాయణపేట 15వ స్థానంలో నిలువగా, గద్వాల 32వ స్థానంలో నిలిచింది.
- రాష్ట్రంలో నారాయణపేట జిల్లాకు 15వ స్థానం
- జోగుళాంబ గద్వాలకు 32వ స్థానం
- జూన్ 3నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
- ఫలించని విద్యాశాఖ చర్యలు
- నాలుగు జిల్లాల్లోనూ పడిపోయిన ఫలితాలు
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో రాష్ట్రంలోనే నారాయణపేట 15వ స్థానంలో నిలువగా, గద్వాల 32వ స్థానంలో నిలిచింది. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను సాధించిన ఉపాధ్యాయులు, విద్యార్థులను జిల్లాల ఉన్నతాధికారులు అభినందించారు.
సత్తాచాటిన బాలికలు..
గత మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా పరీక్షలు జరుగగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడింది. ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువగా.. నారాయణపేట 93.13శాతంతో 15వ స్థానంలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది. నాగర్‌కర్నూల్ (91.57 శాతం) 23వ స్థానం, మహబూబ్‌నగర్ (89.47) 28వ స్థానంలో, వనపర్తి(86.93) 29వ స్థానంలో, గద్వాల (81.38) 32వ స్థానంలో నిలిచాయి. ఐదు జిల్లాల్లోనూ బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులతోపాటు హెచ్ఎంలు, ఉపాధ్యాయులను డీఈవోలు, కలెక్టర్లు అభినందించారు. నాగర్‌కర్నూల్‌జిల్లాలో 78 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. గతేడాది కంటే 1.5శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలతో పాటు రీ కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. పదిహేను రోజుల్లో సబ్జెక్టుకు రూ.500చొప్పున ఫీజు చెల్లించి రీకౌంటింగ్ చేయించుకోవచ్చు. జవాబు పత్రం ఫొటో కాపీ కోసం రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి 12:30గంటల వరకు నిర్వహించనున్నారు. వందశాతం ఉత్తీర్ణత కోసం విద్యాశాఖ చేపట్టిన చర్యలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. నారాయణపేట 15వ స్థానంలో నిలువగా.. మిగిలిన నాలుగు జిల్లాలో 20కంటే దిగువ స్థానంలో పడిపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంచిగా చదివే విద్యార్థులపై శ్రద్ధ ఉంచి.. వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోవడానికి ఉమ్మడి పాలమూరు ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సైతం ఇదే ఒరవడిని కొనసాగించాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

