తెలంగాణ కోసం పుట్టిన పార్టీ.. బీఆర్ఎస్
తెలంగాణ కో సం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మ న్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.
- కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి మంచి భవిష్యత్
- తెలంగాణలో మళ్లీ ఎన్నికలొస్తే బీఆర్ఎస్దే అధికారం
- మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె
మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 3 : తెలంగాణ కో సం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉం దంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హమీలను ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇప్పటి నుంచే ప్రజలు బీఆర్ఎస్ ప్రభు త్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థి తి గ్రామాల్లో ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నా రు. పార్లమెంట్ ఎన్నికలు కేవలం మోదీ, రాహుల్ మ ధ్యనే జరిగాయన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ల ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబటే అదే జరిగిందన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎ స్ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచామ ని, రైతులకు ఉచిత కరెంట్, పంట పెట్టుబడి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేశామన్నారు. అబద్ధపు హమీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సంక్షేమం పూర్తిగా మరిచిందన్నారు. రా ష్ట్రంలో కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటు న్న విషయం ఎమ్మెల్సీ ఫలితంతో స్పష్టమైందని గుర్తు చేశారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 201 4 తర్వాత తెలంగాణలో చాలా మార్పులు వచ్చాయని కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాయని గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణకు చేసిందే మీ లేదని, ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే దర్శనమిస్తాయని వివరించారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అనా థ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చే శారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రం థాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ ఎంపీపీలు సుధాశ్రీ, బాలరాజు, నాయకులు శివరాజ్, దేవేందర్, కరుణాకర్‌గౌడ్, గణేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, గోపాల్‌యాదవ్, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

