Short Circuit | షార్ట్ సర్క్యూట్‌తో బూడిదైన గుడిసె.. ప్రాణాలతో బయటపడ్డ దంపతులు
Short Circuit | నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా గుడిసె దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది.
ఊట్కూర్ (కృష్ణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్( Mudmal ) గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ ( Short Circuit ) కారణంగా గుడిసె దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన బోయ హనుమంతు నివాసముంటున్న గుడిసెలో రాత్రి 11.40 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో హనుమంతు ఇంట్లోనే చిక్కుకుపోగా, ఆయన భార్య బయటకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో గ్రామస్థులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకుని హనుమంతును సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
మంటల్లో చిక్కుకున్న హనుమంతుకు చేతులకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.4.70 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు, యూరియా బస్తాలు, ధాన్యం, గృహోపకరణాలు, విద్యుత్ సామగ్రి, మోటార్ సర్వీస్ వైర్లు, గుడిసె నిర్మాణ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
అలాగే పొలం పాస్‌బుక్కులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, విద్యా సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన పత్రాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

