Home
Mahabubnagar
He Is Getting Employment Making Ganuga Oil With The Help Of Two Bulls And Two Men At A Cost Of Rs 3 Lakhs Which Is Nowhere Else In Palamuru
గానుగ నూనెతో.. లాభాలెన్నో
ప్రస్తుత యాంత్రీకరణ జీవనవిధానంలో మనిషి అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా వంటలో వినియోగించే కల్తీనూనెలతో స్థూలకాయంతో పాటు గుండెజబ్బుల బారిన పడి ఆయుష్షును కోల్పోతున్నారు.
ప్రస్తుత యాంత్రీకరణ జీవనవిధానంలో మనిషి అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా వంటలో వినియోగించే కల్తీనూనెలతో స్థూలకాయంతో పాటు గుండెజబ్బుల బారిన పడి ఆయుష్షును కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో వడ్డేపల్లి మండ లం రామాపురానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు చదివింది పదో తరగతే అయినా వినూత్న ఆలోచనతో ప్రజలకు నాణ్యమైన గానుగ నూనె అందిస్తున్నాడు. పాలమూరు ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా రూ.3లక్షల ఖర్చుతో రెండు ఎద్దులు, ఇద్దరు మనుషుల సాయంతో గానుగ నూనెను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
– వడ్డేపల్లి

గానుగనూనె తయారీ ఇలా..
నాణ్యమైన పల్లీలను తీసుకొని ఒకరోజంతా ఎండబెట్టి త యారు చేసుకున్న గానుగలో వేసి ఎద్దులతో గానుగ తి ప్పు తూ ఇద్దరు మనుషులు స్వచ్ఛమైన నూనెను బయటకు తీస్తారు. తీసిన వాటిని ఎండబెట్టి నాలుగోరోజు స్టీల్, గాజు తదితర బాటిళ్లలో పోసి నిల్వ ఉంచుతారు. ఇది ఆరునెలల వరకు నిల్వ ఉంటుంది. నిల్వ కోసం ప్లాస్టిక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరు.
నూనెలో రకాలు..
కుసుమనూనె, కురిడి కొబ్బెరనూనె, నువ్వులనూనె, పల్లినూ నె, వెర్రినువ్వుల నూనె, ఆవనూనె, ఇప్పనూనె, ఆముదం, అవిశనూనెలను తయారు చేస్తున్నారు.
గానుగనూనెతో ఉపయోగాలు..
నేటి యాంత్రీకరణ జీవన విధానంలో బజారులో దొరికే చౌకబారు నూనెలను వాడుతూ 20 ఏండ్లకే గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. కల్తీ నూనెలతో పోలిస్తే స్వచ్ఛమైన, నాణ్యమైన గానుగనూనెలో సూక్ష్మపోషకాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్కోరకం నూనె ఒక్కో ఔషధంలా పనిచేస్తుందని ఆనాడే మన పూర్వికులు చెప్పారు. నువ్వులనూనెలో కాల్షియం, కుసుమనూనె గుండెకు, వెర్రినువ్వులనూనె నరాల బలహీనతకు మతిమరుపునకు, ఆముదం మలబద్దకానికి, నరాల బలహీనతకు, కొబ్బెరి కొవ్వు కరిగిస్తుంది. ఇలా గానుగ నూనె ఎన్నో విధాలుగా మేలు చేకూరుస్తుంది.
ఔషధంలా పనిచేస్తుంది
కలుషిత వాతావరణంలో, కలుషిత ఆహారం, నూనెలను వాడుతూ చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. స్వచ్ఛమైన నూనెలను అందించాలని ప్రయత్నం మొదలు పెట్టాను. అందరికీ ఆరోగ్యాన్ని పంచడంతో పాటుగా నేను నాతోపాటు నలుగురు ఉపాధి పొందుతున్నాం. ప్రభుత్వం సహకరిస్తే వ్యాపారాన్ని విస్తృతం చేస్తాను.
– బోయ రామకృష్ణ, రామాపురం
కలుషిత నూనెలతో అనారోగ్యం
జబ్బులకు ప్రధానకారణం కలుషిత ఆయిల్ వాడటం, ఉప్పు అధికంగా వాడటమేనని డాక్టర్లు చెపుతున్నారు. ఎద్దుల గానుగనూనె వాడటం వల్ల జబ్బులు వచ్చే ప్రసక్తే లేదు, నాకు 80 సంవత్సరాలు అయినప్పటికీ నేటికీ ఆరోగ్యంగా ఉన్నాను. అందుకనే తినే ఆహారం, నూనె విషయం లో జాగ్రత్తలు పాటించాలి.
– ఉప్పల పూర్ణచంద్రరావు, శాంతినగర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

