పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పరిపాలన సౌలభ్యం కోసమే | పరిపాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ : పరిపాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల నూతన మండల కేంద్రంగా ఏర్పాటైన మహమ్మదాబాద్‌లో మండల కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఐదు జిల్లాలుగా విడిపోయింది. అనేక నూతన మండలాలు ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో పరిపాలన మరింత సులభతరం కానుందని తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండలంలోని పలు గ్రామాలను కలిపి మహమ్మదాబాద్ మండలాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మహమ్మదాబాద్ ఇకపై ప్రత్యేక మండలంగా ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్ రావు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి, మహమ్మదాబాద్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దళారులతో కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న సర్వభ్రష్ట ప్రభుత్వం’
Crime News | జ్యుయెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!
PM Modi: మోదీని మెచ్చుకున్న పిట్రోడా.. దివాళీ విషెస్ చెప్పిన ప్రధాని
Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు : బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

