శ్రీశైలం, సెప్టెంబర్ 28 : శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయి. మూడో రోజైన బుధవారం భ్రమరాంబాదేవి చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆదిపరాశక్తుల్లో తృతీ య రూపిణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించింది. చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కంధాలపై విహరిస్తూ భక్త జనాన్ని అలరింపజేశాడని ఈవో లవన్న తెలిపారు. చంద్రఘంటాదేవి రూపంలో దేవిని అలంకరిం చి అమ్మవారి సింహ మండపం వద్ద ప్రత్యేక వేదికపై అర్చక వేదపండితులు పూజలు నిర్వహించారు. దేవి పది చేతులతో కుడి వైపు పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాలను, ఎడమ వైపు త్రిశూలం, గధ, ఖఢ్గం, పంచముద్ర, కమండలాన్ని ధరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించింది. ప్రశాంత వదనంతో శాంతరూపిణిగా ఉన్నప్పటికీ యుద్ధోన్ముఖురాలై ఉంటుంది. తలపై అర్ధ చంద్రుడుని ఘంటాకారంలో ధరించడంతో చంద్రఘంటాదేవిగా పిలుస్తారు.
అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనసేవపై ఆసీనులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రఘంటా దేవీ సమేతుడైన శ్రీశైలేశుడు రావణ వా హనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. వైభవంగా గ్రామోత్సవం జరగగా.. నాదస్వరం, కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల, కథాకేళి వేషాలు, తప్పెట చిందు, లంబాడి, కాళికా నృత్యం, చెక్కభజన, కోలా టం, ఢమరుకం, చిడుతలు, శంఖం, పిల్లనగ్రోవి, త్రిశూ లం, జేగంట, కురవడోలు, కొమ్ము, నందికోళ్ల సేవ ఆధ్యాంతం కనులపండువగా సాగింది. నాల్గో రోజు భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో దర్శనమివ్వగా మల్లికార్జున స్వామివారికి కైలాస వాహన సే వలో భక్తులను కరుణిస్తారని ఈవో లవన్న తెలిపారు. అమ్మవారికి, స్వామికి వివిధ పూజలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవోలు మల్ల య్య, హరిదాసు, మోహన్, సెక్యూరిటీ అధికారి నర్సింహారెడ్డి, రవికుమార్, విజయసారథి పాల్గొన్నారు.
పసిడి వెలుగులతో జోగుళాంబ
అలంపూర్, సెప్టెంబర్ 28 : అలంపూర్‌లోని ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు జోగుళాంబ అమ్మవారు చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పసిడి వెలుగులు వెదజల్లుతూ చంద్రరేఖలను శిరస్సు లో దేవి ధరించింది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని పూజించడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని భక్తు ల నమ్మకం. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ పూజ లు చేశారు. దేవీ దర్శనభాగ్యంతో భక్తులు పరవశించిపోయారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. ఏర్పాట్లను ఆలయ ఈవో పురేందర్ కుమార్, చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తలు, ఆలయాధికారులు పర్యవేక్షించారు.