వెలుగులోకి నకిలీలలు
ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. గద్వాలలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఎస్పీ సృజన వివరాలు వెల్లడించారు.
- ఫేక్ డాక్యుమెంట్స్ తయారీ ముఠా గుట్టురట్టు
- సులువుగా ఇన్సూరెన్స్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సులు
- పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడిన పలువురు
- పోలీసుల అదుపులో 17 మంది నిందితులు
- కారు, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్టాంప్‌లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన గద్వాల ఎస్పీ సృజన
గద్వాల అర్బన్, ఏప్రిల్ 27 : ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. గద్వాలలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఎస్పీ సృజన వివరాలు వెల్లడించారు. ము ఠాలో ముఖ్యుడిగా ఉన్న మీసాల రామస్వామి ఇది వరకు ఏపీలోని కర్నూల్లో ఆర్టీఐ ఏజెంట్‌గా పనిచేశాడు. దీంతో కంప్యూటర్‌పై కొంతమేర పరిజ్ఞానం ఉండడంతో.. తక్కువ సమయంలో ఎక్కు వ మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న అత్యాశ ఉండేది. ఈక్రమంలో దేశీయ, విదేశీ ఇన్సూరెన్స్‌కు చెందిన వివిధ కంపెనీల లోగోలను డౌన్లోడ్ చేసుకొని, నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి రెండు తెలుగు రాష్ర్టాల్లో చలామణికి తెరతీశాడు.
కర్నూల్, నంద్యాల, అనంతపూర్, తెలంగాణలోని జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకొని వాహనాల విలువ మేరకు ఒక్కొక్కరి వద్ద రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు డబ్బులు వసూలు చేసేవాడు. వచ్చిన ఆదాయంలో 50శాతం మేరకు సమాన వాటా ఏజెంట్లకు చెల్లించేవాడు. వాహనాలకు కావాల్సిన ఫిట్నెస్, ట్రాన్స్‌పోర్టు పర్మీషన్లకు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు సైతం నకిలీ పత్రాలు తయారు చేస్తూ రోజురోజుకూ విస్తరిస్తూ వచ్చాడు. అటు ఇన్సూరెన్స్ కంపెనీలను, ఇటు ప్రభుత్వాన్ని, ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ ఈ రంగంలో ఆరితేరిపోయాడు.
కాగా రామస్వామి గతంలో ఓ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి జైలుకు సైతం వెళ్లొచ్చాడు. నకిలీ ధ్రువపత్రాల దందా పెద్ద మొత్తంలో సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అలంపూర్ సీఐ సూర్యానాయక్, ఉండవెల్లి ఎస్సై బాలరాజు, సిబ్బంది బుధవారం సాయంత్రం కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కర్నూల్ జిల్లాకు చెందిన రామస్వామి కీలకమని గుర్తించి అతడిని పూర్థిస్థాయిలో విచారించారు.
అతడితోపాటు గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండతోపాటు ఏపీలోని నంద్యాల, కర్నూల్ ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 17 మందిపై కేసు నమోదు చేశారు. ఉండవెల్లి పీఎస్‌లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకున్నారు. ఏ-1గా మీసాల రామస్వామితోపాటు చంద్రకుమార్, రవికుమార్, మాధవస్వామి, శ్రీకాంత్, సుధాకర్, తెలుగు విశ్వనాథ్, తెలుగు మధుసూదన్, రంగన్న, షఫీ, కోళ్ల ప్రేమ్‌కుమార్, పొత్తిలి సురేశ్‌గౌడ్, బోయిని నగేశ్, కొట్ర లక్ష్మయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘునాథ్, దాసరి ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, రెండు కలర్ ప్రింటర్లు, నకిలీ ఆర్సీలు, ఇన్సూరెన్స్ ధ్రువపత్రాలు, నకిలీ స్టాంపులు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని రిమాండ్ కోసం అలంపూర్ కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. ప్రెస్మీట్లో డీఎస్పీ రంగస్వామి, సీఐ సూర్యానాయక్, ఎస్సైలు మహేందర్, బాలరాజు, నరేశ్, శేఖర్‌రెడ్డి, వెంకటస్వామి, కుర్మన్న, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- bust
- fake documents
- gadwal
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

