Gadwal | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.. కలెక్టర్ ఆదేశాలు
Gadwal | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.
Gadwal | గద్వాల : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండలంలోని ఉప్పేరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ప్రసవాల రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రిజిస్టరులో సక్రమంగా పూర్తి వివరాలతో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రికి ప్రతి రోజు రోగులు ఎంతమంది వస్తున్నారు, ఇన్ పేషంట్స్ వివరాలను వైద్య సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, విధుల్లో సమయపాలన కచ్చితంగా పాటించాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించి, గర్భిణుల నార్మల్ ప్రసవాలు నిర్వహించి, ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు. ప్రతి గర్భిణి ప్రసవ తేదీకి అనుగుణంగా డెలివరీ క్యాలెండర్‌ను ఖచ్చితంగా రూపొందించి, అవసరమైన వైద్య సదుపాయాలు సమయానికి అందించాలని అన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రాంతానికి ఒక అంబులెన్స్‌ను త్వరితగతిన కేటాయిస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఫార్మసిస్టు మందుల నిల్వలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. టీకాలు ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి వేయాలని సూచించారు. ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సిద్దప్ప, డాక్టర్లు రాజు, కృష్ణవేణి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

