మాటమార్చడమే కాంగ్రెస్ నైజం
ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని చెప్పి నేడు సన్న రకానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి రైతులు, ప్రజలను మోసం చేశారని, మాటమార్చడమే కాంగ్రెస్ నైజమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
- రైతులు, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- బోనస్ ఇవ్వరు.. కానీ ఓట్లకు మాత్రం డబ్బులు పంచుతారు..
- వ్యవసాయంపై కనీస అవగాహన లేని సీఎం రేవంత్‌రెడ్డి
- భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ఎత్తిపోతలకు నీటిని తరలిస్తే అడ్డుకుంటాం
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ టౌన్, మే 16 : ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని చెప్పి నేడు సన్న రకానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి రైతులు, ప్రజలను మోసం చేశారని, మాటమార్చడమే కాంగ్రెస్ నైజమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సన్నరకంతోపాటు దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మక్తల్‌లో బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులు పం డించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, క్విం టాపై రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చె ప్పి నేడు మాటమార్చడం దారుణమన్నారు.
వ్యవసాయంపై అవగాహన లేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారన్నారు. హామీలను మరిచి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓటుకు రూ.500 ఇచ్చి కొనుగోలు చే శారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చాలా మంది రైతులు దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల కు తీసుకొచ్చారని, కానీ సన్నరకానికి మాత్రమే బో నస్ చెల్లిస్తామని చెప్పి వారిని నిలువునా మోసం చే శారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే రై తులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. కేసీఆర్ ప్ర భుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా పంట పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు సకాలం లో అందించడంతోపాటు 24 గంటలపాటు ఉచితం గా కరెంట్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చామన్నారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో క రెంట్ సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయాయని, రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడంతోపాటు కరువు పరిస్థితులు దాపురించాయన్నారు. దీంతో చాలా మంది రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పైప్‌లైన్ ద్వారా నీటిని తీసుకెళ్తానని దొంగ జీవోలను తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ఎ త్తిపోతల పథకానికి నీటిని తీసుకెళ్తే తాము కచ్చితం గా అడ్డుకుంటామన్నారు.
అభివృద్ధికి తోడ్పడితే మీ వెంబడి అడుగేస్తానని, రైతుల నోట్లో మట్టికొట్టి కొ డంగల్‌కు నీటిని తరలించే ప్రక్రియ చేపడితే ప్రాణా లు తెగించైనా నీటి తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి తాసీల్దార్ కా ర్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కా ర్యక్రమంలో మాగనూరు మాజీ జెడ్పీటీసీ సరితామధుసూదన్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, కౌన్సిలర్ మొగులప్ప, పట్టణ అధ్యక్షుడు హనుమం తు, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, నా యకులు శ్రీనివాస్‌గుప్తా, రాజుల ఆశిరెడ్డి, టీటీసీ ఆశిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జయానంద్, అన్వర్హుస్సే న్, నర్సింహారెడ్డి, శంకర్, ప్రతాప్‌రెడ్డి, రాజు, శివారెడ్డి, సాగర్, సాధిక్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

