ప్రతిరైతుకూ రుణమాఫీ చేయాలి
పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భూత్పూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీ విషయంలో జీవోలకు, సీఎం మాటలకు పొంతన లేకుండా ఉన్నదన్నారు.
- జీవోలకు.. సీఎం మాటలకు సంబంధం లేదు
- ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయాలి
- రైతులకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాడుతాం
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్, జూలై 19 : పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భూత్పూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీ విషయంలో జీవోలకు, సీఎం మాటలకు పొంతన లేకుండా ఉన్నదన్నారు. అధికారులు జీవోల ప్రకారంగానే పని చేస్తారని, రేషన్‌కార్డు ఆధారంగా కాకుండా పాస్‌బుక్‌ను చూసి రుణమా ఫీ చేయాలని కోరారు. చాలా మందికి రూ.50వేలు రుణం ఉన్నా మాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకు వస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం జీవోలను మార్చి రుణమాఫీ చేస్తే ఎక్కువ మంది రైతులు లబ్ధి చేకూరుతుందన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం 39లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే ఇప్పుడు కేవలం 11లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి కేవలం 30శాతం మంది రైతులకు మాత్రమే చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు కాకమ్మ కబుర్లు చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. డిసెంబర్ 9లోగా రుణమాఫీ చేస్తానని చెప్పి జూలైలో కూడా చేయకపోవడం రైతులపై ఈ ప్రభుత్వం ఎం త నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమవుతుందన్నారు.
ఉ త్తదానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చే యడం విడ్డూరంగా ఉందని, ఆగస్టు15వ తేదీలో గా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కు అన్యాయం జరిగితే ఊరుకోమని, రుణమాఫీ అ మలు కానీ రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మ న్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మనెమోని సత్యనారాయణ, నర్సింహాగౌడ్, మురళీధర్‌గౌడ్, సాయిలు, గోప్లాపూర్ సత్యనారాయణ, మహమూద్, వెంకట్రాములు, గడ్డం రా ములు, రామునాయక్, తిరుపతయ్య, రాకేశ్, యా దయ్య, లక్ష్మయ్య, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

