వనపర్తి, జూలై 18 : గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న సినీనటుడు ఆర్. నారాయణమూర్తిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం పరామర్శించి ధై ర్యం చెప్పారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ హక్కుల కోసం ప్రజలను చైతన్యపరిచే ఎన్నో చిత్రాలు తీసి సందేశమిచ్చిన నారాయణమూర్తి ఆయురారోగ్యాలతో ఉం డాలని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. తనను పరామర్శించడానికి వచ్చిన నిరంజన్‌రెడ్డికి నారాయణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఆ రోగ్యంగానే ఉన్నానని, దుష్ప్రచారాలను అభిమానులు, ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.