వనపర్తి, జూన్ 17 : త్యాగానికి ప్రతీక బక్రీద్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన నివాసం లో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముస్లింలు జరుపుకొనే పండుగలలో బక్రీద్ పండుగ చాలా ప్రత్యేకమైందన్నారు. ముస్లింలు మహ్మద్ ప్రవక్త త్యాగా న్ని స్మరించుకుంటూ త్యాగం, కరుణ, ఐక్యతలను అ లవర్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలకు ప్రత్యేకతను కల్పించే వారని తెలిపారు. రా ష్ట్రంలో ఏ పండుగనైనా ప్రతిఒక్కరూ సోదర భావం తో జరుపుకొనే వాతావరణం ఉండేదన్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితులే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.