కొల్లాపూర్, నవంబర్ 28 : సక్సెస్ మన జీవితంతోపాటు సొసైటీలో కూడా ఎంతో మార్పు వస్తుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అ న్నారు. కొల్లాపూర్‌లోని రాజావారి బంగ్లాలో రా ణి ఇందిరాదేవి విద్యాసంస్థల్లో చదివిన పూర్వ వి ద్యార్థులతో స్వర్ణోత్సవం నిర్వహించారు. ఈ వే డుకలకు విజయ్ దేవరకొండ హాజరు కాగా, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాం తమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కొల్లాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ ప్రాంతంతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు.
ఇక్కడి ఆర్ఐడీ పాఠశాల నుంచి భారత దేశంతోపాటు అమెరికా ఇత ర దేశాల్లోని 14 బిట్స్‌పిలాని లాంటి గొప్ప యూ నివర్సిటీలకు వైస్ చాన్స్లర్స్గా, చైర్మన్లుగా ఉండ డం అభినందనీయమన్నారు. ఇక్కడి స్కూల్ నుంచి మై హోం చైర్మన్ రామేశ్వర్రావు, బిట్స్‌పిలాని వైస్ చాన్స్‌లర్ రాంగోపాల్‌రావు గొప్ప స్థా యిలో ఉన్నారని తెలిపారు. తన అమ్మ, మామ య్య ఇక్కడే చదువుకోవడంతో ఇక్కడి వారితో బంధుత్వం ఉందన్నారు. అనంతరం ఆర్ఐడీ పా ఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. కాగా, స్వర్ణోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ బృందంతో శుక్రవారం సా యంత్రం కొల్లాపూర్‌లో మ్యూజికల్ నైట్ ఏర్పా టు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మైహోం అధినేత రామేశ్వర్రావు, యశో ద దవాఖాన డైరెక్టర్ సురేందర్‌రావు ఉన్నారు.