ఆధ్యాత్మిక పరిమళం
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా త్రినేత్రికి తుంగభద్రానదిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ సమీపంలోని నదిలో ఆదిదంపతులు హంస వాహనంపై జల విహారం (తెప్పోత్సవం) చేయగా నదీమతల్లి పులకించింది.
- జలవిహారం చేసిన ఆది దంపతులు
- తుంగభద్ర తల్లికి దశవిధ హారతులు
అలంపూర్, అక్టోబర్ 24 : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా త్రినేత్రికి తుంగభద్రానదిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ సమీపంలోని నదిలో ఆదిదంపతులు హంస వాహనంపై జల విహారం (తెప్పోత్సవం) చేయగా నదీమతల్లి పులకించింది. దసరా పండుగను పురస్కరించుకొని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం శమీపూజ, మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం తుంగభద్రానదిలో ఆది దంపతులైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై (హంస వాహనం)నదిలో జల విహారం చేశారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి అలంపూర్ సివిల్ జడ్డి కమలాపురం కవిత, భక్తులు అశేషంగా తరలొచ్చారు.
ఉత్సవాల ముగింపు రోజున జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వాముల ఉత్సవమూర్తులకు ఆలయ సమీపంలో నాగకన్యల బావిలో చక్రస్నానం చేయించారు. తెప్పోత్సవం ముగిసిన వెంటనే నదీ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో అర్చకులు నదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుంభహారతి, రథహారతి, నక్షత్ర హారతి, దశవిధ హారతులను నదీమ తల్లికి సమర్పించారు. నదికి హారతి ఇవ్వడం అంటే సకల దేవతలను ఏక కాలంలో స్మరించిట్లేనని పండితులు పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల నృత్య కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన ఆయా శాఖల అధికారులు, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్కు దేవస్థానం తరఫున ఆలయ పాలక మండలి చైర్మన్ చిన్నకృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాజు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
జోగుళాంబ సన్నిధిలో ఎమ్మెల్సీ చల్లా
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మంగళవారం ఉద యం అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. వా రికి ఆ లయ పాలక మండలి చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్కుమార్ అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. వారి వెంట స్థానిక బీఆర్ఎస్ నా యకులు విజయుడు, నరేందర్రెడ్డి తదితరులున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

