హరిత ప్రేమికుడు నిత్య శ్రామికుడు
అతడో కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి.. మొక్కలంటే అతడికి ప్రాణం.. పచ్చదనమే ధ్యేయంగా వీఆర్ఏ అడుగులు వేస్తున్నాడు.. అందుకే ఇప్పటి వరకు 120 మొక్కలను దత్తత తీసుకొని నాటి సంరక్షిస్తున్నాడు. నాలుగేండ్లుగా గ్రీనరీ కోసం శ్రమిస్తున్నాడు.
- 120 మొక్కలను దత్తత తీసుకున్న గ్రామ సేవకుడు
- పచ్చదనమే ధ్యేయంగా అడుగులు
- నాలుగేండ్లుగా శ్రమిస్తున్న వీఆర్ఏ
- సీఎం కేసీఆర్ స్ఫూర్తితో మొక్కల పెంపకం : రమేశ్ నాయుడు
అతడో కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి.. మొక్కలంటే అతడికి ప్రాణం.. పచ్చదనమే ధ్యేయంగా వీఆర్ఏ అడుగులు వేస్తున్నాడు.. అందుకే ఇప్పటి వరకు 120 మొక్కలను దత్తత తీసుకొని నాటి సంరక్షిస్తున్నాడు. నాలుగేండ్లుగా గ్రీనరీ కోసం శ్రమిస్తున్నాడు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు గ్రామ సేవకుడు రమేశ్ నాయుడు చెబుతున్నాడు.
పెంట్లవెల్లి, జనవరి 22 : సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం స్ఫూర్తితో హరిత తెలంగాణకు నడుంబిగించాడు వీఆఏ రమేశ్‌నాయుడు. 120 మొక్కలను దత్తత తీసుకొని నాలుగేండ్లుగా చిన్నపిల్లల మాదిరిగా పోషిస్తున్నాడు. తన పేరుమీద హరితహారం టీ షర్టులు తయారు చేయించుకొని పలువురికి ఆదర్శం గా నిలుస్తున్నాడు. ఏటా వందల మొక్కలను నాటి నిత్యం 100 నుంచి 120 బిందెల నీళ్లను పడుతూ సంరక్షిస్తున్నాడు. సొంత ఖర్చులతో మొక్కల చుట్టూ పాదులు తీశాడు.
గ్రామ సరిహద్దు నుంచి ఊరి వరకు ‘పర్యావరణాన్ని సంరక్షించాలి’ అనే నినాదాలతో కూడిన బోర్డులను రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేశాడు. పెం ట్లవెల్లి మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచాలకట్ట గ్రామంలో ఒకపక్క వీఆర్ఏగా విధులు నిర్వహి స్తూ.. మరోపక్క మొక్కలను సంరక్షిస్తూ అందరి నోట శభాష్ అనిపించుకుంటున్నాడు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోశ్‌కుమార్ ఛా లెంజ్లను స్వీకరించి అక్కడడక్కడా ఎండిపోయిన మొక్కల స్థా నంలో నూతన మొక్కలను నర్సరీల నుంచి తీసుకొచ్చి నాటుతున్నాడు.
కొన్ని సందర్భాల్లో గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానది నుంచి బిందెల ద్వారా నీరు తీసుకొచ్చి మొక్కలకు పోస్తున్నా డు. పెంట్లవెల్లి తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తన కుటుంబ సభ్యులు మొక్కలకు నీరు పోస్తుంటారు. మొక్కలను దత్తత తీసుకొని సంరక్షిస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి రమేశ్‌నాయుడును శాలువాతో ఘనంగా సన్మానించారు. రమేశ్‌కు భార్య శ్రీకన్య.. ముగ్గు రు ఆడపిల్లలు (సంజన, ప్రణీత, సాయిపల్లవి) ఉన్నారు. జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. పోషణ భారమైనా మొక్కలపై మమకారం చంపుకోలేక అపరభగీరథుడిగా సంరక్షిస్తున్నాడు.
హరితహారం స్ఫూర్తితోనే..
సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం కింద గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నా. భావితరాలకు ప్రాణవాయువు అందించాలని పిలుపునివ్వడంతో నా వంతుగా మొక్కలను సంరక్షించాలన్న కఠోర లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. సొంత డబ్బులు వెచ్చించి ఒక్కో మొక్కకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి వివిధ రకాల బోర్డులను ఏర్పాటు చేయించాను. మొక్కల సంరక్షణలో నా భార్య సహకారం ఎంతో ఉన్నది.
– రమేశ్‌నాయుడు, వీఆర్ఏ, మంచాలకట్ట
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

