పులి దాడిలో ఆవు మృతి
నల్లమల అటవీ ప్రాంతంలో నక్కినోనిగండి ప్రాంతంలో పులి దాడిలో ఆవు మృత్యువాత పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి బాలయ్య తన పశువుల మందను మేత కో సం ఆదివారం నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
- నక్కినోనిగండి ప్రాంతంలో ఘటన
- పరిశీలించిన అటవీశాఖ అధికారులు
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 29 : నల్లమల అటవీ ప్రాంతంలో నక్కినోనిగండి ప్రాంతంలో పులి దాడిలో ఆవు మృత్యువాత పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి బాలయ్య తన పశువుల మందను మేత కో సం ఆదివారం నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే మందలో నుంచి ఓ ఆవు తప్పిపోయిన తన లేగదూడను వెతుకుతూ వెళ్తున్న సమయంలో నక్కినోనిగండి ప్రాంతంలో మాటుకాచి ఉ న్న పెద్దపులి ఆవును హతమార్చింది. అయితే బాల య్య తన ఆవు మృత్యువాత పడినట్లు గుర్తించాడు.
ఆవు మెడ భాగంపై రక్తాన్ని పీల్చి ఆ తరువాత వెన కి భాగాన్ని చీల్చి తిన్నట్లు, ఇది పెద్ద పులి దాడే అని నిర్ధారణ చేసుకొని తిరిగి వచ్చాడు. ఈ మేరకు బాధితుడు సోమవారం లింగాల ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ రేంజర్ వీరేశం, సిబ్బంది అక్కడికి చేరుకొని ఆవు కళేబరాన్ని పరిశీలించి పులిదాడిలోనే మృతి చెందినట్లు పంచనామా వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బాలయ్యను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

