Harish Rao | బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | బీసీలకు,కుర్వ, గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.
మహబూబ్ నగర్ : బీసీలకు ( BCs ) ,కుర్వ, గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) ఆరోపించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య( Doddi Komaraiah ) జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో కొమురయ్య విగ్రహానికి మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ , లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ బీసీలకు వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని కేవలం రూ. 7 కోట్ల మాత్రమే నిధులు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. శాసన సభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసినట్టు వెల్లడించారు. యాదవులకు గోర్లు ఇస్తామని, నగదు బదిలీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. కనీసం మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదని చెప్పారు.
దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను కోరితే వెంటనే అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పచ్చబడాలని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హరీష్ రావు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. గతంలో 14 రోజులకు ఒకసారి నీళ్లు రాగా బీఆర్ఎస్ హయాంలో ప్రతి రోజు నీళ్లు ఇచ్చామని వివరించారు.
రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేమని, సాగు నీరు అందించేందుకు పూర్తి ప్రయత్నాలు చేసామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. రాజకీయంగా బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు ఇస్తామని మోసం చేశారని తెలిపారు .విద్య,ఉద్యోగాల్లో కూడా రిసర్వేషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

