మాగనూరు కృష్ణ : నారాయణపేట జిల్లా మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలంలోని గుడేబల్లూర్ గ్రామంలో కొనసాగుతున్న స్వయంభు (Swayambhu Temple) శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పాలవుట్ల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ ( Child Rights Protection) కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి ( Seethadayakar Reddy), మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Rammohan Reddy) స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వారిని ఆలయ పూజారి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వామివారి కరుణ కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు శివరాజ్ పటేల్, ఆంజనేయులు, అంబరీష్, సుదర్శన్ గౌడ్, నరసింహారెడ్డి, రవీందర్, వేణుగోపాల్, రాకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.