మొదటి రోజు ప్రశాంతం
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. పరీక్షలను కలెక్టర్ రవినాయక్, డీఈవో రవీందర్ పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 59 పరీక్షా కేంద్రాల్లో 12,711 మంది విద్యార్థులకు 12,688 మంది హాజరుకాగా, 43 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు.
- ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
- పోలీసు బందోబస్తు మధ్య నిర్వహణ
- మహబూబ్‌నగర్‌లో కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్ రవినాయక్
పాలమూరు, మార్చి, 18 : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. పరీక్షలను కలెక్టర్ రవినాయక్, డీఈవో రవీందర్ పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 59 పరీక్షా కేంద్రాల్లో 12,711 మంది విద్యార్థులకు 12,688 మంది హాజరుకాగా, 43 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 27 మందికిగానూ 21 మంది హాజరయ్యారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, మార్చి18: పదో తరగతి వార్షి క పరీక్షలు సోమవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. దేవరకద్ర మండలం లో మొత్తం 711 మంది విద్యార్థులకు గానూ ఇద్దరు గైర్హాజరయ్యారని మండల విద్యాధికారి జయశ్రీ తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మండల కేంద్రంలోని బా లుర పాఠశాలలో ఒకరు, బాలికల ఉన్నత పాఠశాలలో ఒకరు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు.
దేవరకద్రరూరల్,(కౌకుంట్ల), మార్చి 18: కౌకుంట్ల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో మొత్తం 112మంది విద్యార్థులు హాజరయ్యారు. చిన్నచింతకుంట మండలం, చింతకుంటలోని జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో 281మంది, వడ్డెమాన్ పరీక్షా కేంద్రంలో 200 మంది విద్యార్థులకు, నలుగురు గైర్హాజరు కాగా, 196 మంది పరీక్ష రాసినట్లు ఆయా పరీక్షా కేంద్రాల అధికారులు తెలిపారు.
మూసాపేటలో..
మూసాపేట, మార్చి 18: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మూసాపేట జెడ్పీహెచ్ఎస్లో మొ త్తం 170 మంది విద్యార్థులకు గానూ 169 మంది హాజరయ్యారని, జానంపేటలో 226 విద్యార్థులకు 225 మంది హాజరయ్యారని ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అడ్డాకుల పరీక్ష కేంద్రంలో 253మంది విద్యార్థుల కుగానూ 251 మంది పరీక్ష రాశారని అడ్డాకుల ఎంఈవో నాగయ్య తెలిపారు. పరీక్షా కేంద్రా ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నర్వ మండలంలో..
నర్వ, మార్చి 18 : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. నర్వ మండలంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో నర్వ ఉన్నత పాఠశాలలో 209 మంది, కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో 170, పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాలలో 127మందికి 125 మంది హాజరైనట్లు విద్యాధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను తాసీల్దార్ మల్లారెడ్డి తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేసినట్లు ఎస్సై కురుమయ్య పేర్కొన్నారు.
222 మంది హాజరు..
మాగనూర్, ఏప్రిల్ 18 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పరీక్షకు 222 మంది విద్యార్థులకు గానూ 222 మంది హాజరైనట్లు డీవో నాగార్జున తెలిపారు. అనంతరం పరీక్ష పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మార్చి18: మండల వ్యాప్తం గా 462మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో 240మంది విద్యార్థులకు గానూ, 239 మంది హాజరయ్యారు. న్యూఎరా హైస్కూల్లో 262మంది విద్యార్థులకు అందరూ పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎస్సై శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నారాయణపేటలో..
నారాయణపేట రూరల్, మార్చి 18 : జిల్లావ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 7,678 మందికి గానూ 7,653 మంది హాజరుకాగా, 25 మంది గైర్హాజరయ్యారని డీఈవో అబ్దుల్గని తెలిపారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, మార్చి 18 : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 241 విద్యార్థులకు గానూ 239మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. కానుకుర్తి పరీక్షా కేంద్రంలో 196 మందికి మొత్తం హాజరైనట్లు పరీక్షా కేంద్రాల బాధ్యులు శంభులింగం, తిరుపతయ్య తెలిపారు.
ఊట్కూర్ మండలంలో..
ఊట్కూర్, మార్చి 18: మండలంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు పులిమామిడి జెడ్పీహెచ్ఎస్, కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రాల్లో సోమవారం 491 మంది విద్యార్థులకుగానూ 490 మం ది హాజరైనట్లు ఎంఈవో వెంకటయ్య తెలిపారు. మం డలంలోని చిన్నపొర్ల జెడ్పీహెచ్ఎస్ ఒక విద్యార్థి పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను తాసీల్దార్ మమత సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేశారు.
మక్తల్‌లో..
మక్తల్ టౌన్ మార్చ్ 18: మక్తల్ పట్టణంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పరీక్షల నిర్వహణ కోసం మక్తల్ పట్టణంలోని 6 సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 240, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 240, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 200, కేరళ పబ్లిక్ సూల్లో 219, బ్రిలియంట్ గ్రామర్ హైసూల్లో 189, అక్షర సూల్లో 193 మంది మొత్తం 1281 మంది హాజరయ్యారు. మక్తల్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
కృష్ణలో..
కృష్ణ, మార్చి 18 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 300 మందికి 299 మంది హాజరయ్యారని విద్యాధికారులు తెలిపారు.
బాలానగర్‌లో..
జడ్చర్ల(బాలానగర్), మార్చి 18 : బాలానగర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల, రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మొత్తం 631మంది విద్యార్థులకు గానూ ఇద్దరు గైర్హాజరు కాగా, 629మంది పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు.
జడ్చర్లలో..
జడ్చర్ల టౌన్, మార్చి18 : జడ్చర్ల మండలంలో ఏర్పాటు చేసిన 8 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,828 మంది విద్యార్థులకు గానూ 1,825 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఎంఈవో మంజులాదేవి పరిశీలించారు. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
రాజాపూర్‌లో..
రాజాపూర్, మార్చి 18 : మండలంలో 213 మందికి 212మంది టెన్త్ పరీక్షకు హాజరైనట్లు ఎంఈవో వెంకటయ్య సోమవారం తెలిపారు.
నవాబుపేటలో..
నవాబ్‌పేట, మార్చి 18 : మండలంలో మూడు పరీక్షా కేంద్రాల్లో 616 మంది విద్యార్థులు పరీక్ష రా శారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నోడల్ అధికారి నాగ్యానాయక్ తెలిపారు.
మిడ్జిల్‌లో..
మిడ్జిల్, మార్చి 18 : మండలంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో 302 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు విద్యాధికారులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

