కనిపించని శత్రువు
క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నది. అప్రమత్తంగా ఉండాల్సింది మరిచి ఏరికోరి క్యాన్సర్ బారిన పడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భ్రమ ప డుతూ.. దాని వలలో చిక్కుకుంటున్నారు. మా రిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అతిగా మ ద్యం సేవించడం, మాంసాహారం తినడం, గు ట్కాలు, పాన్ మసాలాలు నమలడం
- రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు
- వాతావరణ కాలుష్యం పెనుముప్పుగా..
- ఆహారపు అలవాట్లు కూడా అంటున్న వైద్యులు
- అధికంగా గొంతు, రొమ్ము, గర్భాశయ రకాలు
- ఆందోళన కలిగిస్తున్న నోటి క్యాన్సర్
క్యాన్సర్ చిన్నగా మొదలవుతుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఒక్కసారిగా బయటపడుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.. ఈ వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా ఉంటాయి. అందుకే దీన్ని కనిపించని శత్రువుగా పోల్చుతారు. రోజురోజుకూ బాధితులు పెరుగుతున్నారు. వాతావరణ కాలుష్యం పెనుముప్పుగా మారగా.. ఆహార అలవాట్లు కూడా మరో కారణంగా వైద్యులు చెబుతున్నారు. అధికంగా గొంతు, రొమ్ము, గర్భాశయ వ్యాధులు పెరుగుతున్నాయి. వనపర్తి జిల్లాలో మాత్రం నోటి క్యాన్సర్ ఆందోళన కలిగి స్తున్నది. మగవారితో పోలిస్తే మహిళల్లోనే రొమ్ము క్యాన్సర్కేసులు ఎక్కువే.

వనపర్తి, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నది. అప్రమత్తంగా ఉండాల్సింది మరిచి ఏరికోరి క్యాన్సర్ బారిన పడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భ్రమ ప డుతూ.. దాని వలలో చిక్కుకుంటున్నారు. మా రిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అతిగా మ ద్యం సేవించడం, మాంసాహారం తినడం, గు ట్కాలు, పాన్ మసాలాలు నమలడం, ఆలస్య పు వివాహాలు వంటి అంశాలు క్యాన్సర్ బారిన పడేలా చేస్తున్నాయి. సాధారణంగా వృద్ధాప్యం లో కనిపించే జబ్బులు పాతికేండ్లలోపు యువకులకు సోకుతుండడం ఆందోళన కలిగించే వి షయం. రాష్ట్ర వ్యాప్తంగా 48,320 క్యాన్సర్ కే సులు నమోదు కాగా.. కేవలం వనపర్తి జిల్లాలో 222 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యంపై ఇదే రకమైన నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వనపర్తి జిల్లాలో సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయని నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సా యిరెడ్డి తెలిపారు. చాలా మందికి క్యాన్సర్ ఉ న్నా.. బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది ప డుతున్నారన్నారు. తల, మెడ క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి. ఐసీఎంఆర్, ఆరోగ్య శ్రీ లె క్కల ప్రకారం పట్టణాల్లో ఎక్కువగా విస్తరిస్తున్న ట్లు తేలింది. జిల్లాలో నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. తల, మెడ, రొమ్ము, గ ర్భాశయ ముఖద్వారం, లుకేమియా, పెద్దపేగు, చిన్నపేగు, లంగ్స్, లివర్, థైరాయిడ్, లింపో మా, మలద్వారం, కణజాల సంబంధం, అన్నవాహిక క్యాన్సర్.. వంటి అనేక రకాల వ్యాధులు మనిషి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
క్యాన్సర్కు కారణాలు..
- పంట పొలాల్లో చీడపీడల నివారణ కోసం రైతులు వివిధ రకాల మం దులు పిచికారీ చేస్తున్నారు. కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది నీళ్లలో శుభ్రం చేయకుండా నేరుగా వండుతున్నారు. మందుల అవశేషాలతో కూడిన కూరగాయలు తినడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి.
- కార్మికుల్లో చాలా వరకు బీడీ, తంబాకు, గుట్కా, పాన్ మసాలాలు ఎక్కువగా వాడుతున్నారు. ఫలితంగా నోరు, గొంతు, దంత క్యాన్సర్ల బారిన పడుతున్నారు.
- మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది. జీవితంతో సెటిల్ అయ్యాక పెండ్లి చేసుకుందామనే ధోరణి ఎక్కువైంది. దీంతో 30 ఏం డ్లు వచ్చినా పెండ్లిళ్లు చేసుకోవడం లేదు. ఒక వేళ పెండ్లి చేసుకున్నా.. అందం చెడిపోతుందనే ఉద్దేశంతో పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. ఇటువంటి వారికి రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
- ఫాస్ట్ఫుడ్ కల్చర్ కూడా క్యాన్సర్కు కారణమవుతున్నది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అతిగా ఆయిల్వేసి వేయించి.. మసాలా దట్టించిన ఆహారం తీసుకోవడంతో పెద్దపేగు, చిన్నపేగు క్యాన్సర్ వస్తున్నది
- పీకల దాకా మద్యం తాగేవారితోపాటు పరిమితికి మించి మాంసాహారం తీసుకుంటున్న వారిలో లివర్ క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయి.
- వాహన వినియోగం పెరగడం, గ్రామాలకు ఆనుకొని ఉన్న పరిశ్రమలు కూడా క్యాన్సర్కు కారణమవుతునన్నాయి.వీటిద్వారా విడుదలవుతున్న కాలుష్యం గాలిలో కలిసి బలితీసుకుంటున్నది. రసాయనాలతో కూడిన ఈ గాలిని పీల్చిన వారు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..
క్యాన్సర్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఫాస్ట్ఫుడ్ జో లికి వెళ్లకుండా మంచి ఆహారం తీసుకోవాలి. మంచి వాతావరణం లో ఉండాలి. మసాలాలు, వేపుడు పదార్థాలు తగ్గించాలి. మద్యపానం విషయంలో నియంత్రణ పాటించాలి. గొంతు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయల భోజనం రోజువారి మెనూలో ఉండేలా చూసుకోవాలి. కొందరిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నా చాలా రోజుల తర్వాత బయటపడుతున్నది.
– రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

