తెలంగాణ ఉద్యమ సూరీడు.. స్వరాష్ట్ర సాధకులు.. జన నేత.. ప్రగతి ప్రదాత.. సంక్షేమ సారథి, గులాబీ బాస్ కేసీఆర్ జన్మదిన వేడుకలు పండుగను తలపించాయి. ఊరూవాడా సంబురాలు అంబరాన్నంటాయి. కేక్ కటింగ్ల జోరు.. పటాకుల మోతలు హోరెత్తాయి. అధినేతపై అభిమానంతో గులాబీ పార్టీ శ్రేణులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాయి.
దవాఖానల్లో రోగులకు, వృద్ధాప్య, ఆశ్రమాల్లో అనాథలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కొల్లాపూర్లో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు క్షీరాభిషేకం చేశారు. విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్లు అందించారు. కేసీఆర్ చల్లగా ఉండాలంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శతమానం భవతి అంటూ అర్చకులు ఆశీర్వదించారు. జై కేసీఆర్.. సాహో కేసీఆర్ అంటూ నినదించారు.