నాగర్ కర్నూల్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రక్త నిల్వలను ( Blood stocks ) అధిక మొత్తంలో సేకరించి ఉంచాలని నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రఘు ( Doctor Raghu ) సూచించారు. ఈ నెల 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ( Nurse Day ) సందర్భంగా తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ( Blood Donation ) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రక్తనిల్వలను అధిక మొత్తంలో సేకరించి ఉంచాలని అన్నారు. అవసరమైతే సైనికులకు రక్తం నిల్వలను పంపిస్తామని తెలిపారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సీ హనుమంతరావు పలుమార్లు రక్తాన్ని ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రక్తదానం చేయడం వల్ల దాతల్లో నూతన ఉత్తేజితం ఏర్పడుతుందని, రక్త కణాలు తిరిగి పునరుత్పత్తి అవుతాయని వెల్లడించారు .
జిల్లా ఆస్పత్రిలో ప్రసవాలకు వచ్చిన గర్భిణులకు , ఆర్థోపెడిక్, సాధారణ శస్త్ర చికిత్సలకు రోగులకు నిత్యం పాజిటివ్ గ్రూపులతో పాటు నెగటివ్ గ్రూపూ నిల్వలు కూడా అందుబాటులో ఉంచి ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. సాధారణ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుంచి కల్వకుర్తి అచ్చంపేట బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ సెంటర్లకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్త నిధి సేకరణ నర్సింగ్ సిబ్బందితో జరుగుతున్నట్లు జిల్లా నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిదెవి, కార్యదర్శి యం. ఆనంద్, జొన్ సెవన్ ప్రెసిడెంట్ మన్మోహన్ రెడ్డి తెలిపారు. శిబిరంలో 40 మంది నర్సింగ్ ఆఫీసర్లు, 10మంది ఇతరులు రక్తదానం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ సి హనుమంతరావు, డాక్టర్ ప్రశాంత్, అజీమ్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ రోహిత్, డాక్టర్ అనిత, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు నిర్మల, అమృత, పద్మ ,సునీత, నర్సింగ్ ఆఫీసర్లు, మన్మోహన్ రెడ్డి రామాంజనేయులు, హరికృష్ణ, రాజశేఖర్, రాజు, మహేష్, పుష్పలత, చెన్నకేశవులు, ఉమాదేవి, సరస్వతి, జ్ఞానేశ్వరి, సువేద, రేవతి, కవిత, కిరణ్ బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆంజనేయులు, ఫయాజ్ షాకీర్, పి.రామకృష్ణ, హెల్ప్ డెస్క్ ఇన్చార్జి టీయాదగిరి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.