HomeMahabubnagarBefore The Formation Of Telangana Before Ala Venkateshwar Reddy Won As Devarakadra Mla Everything In The Constituency Was Home To Drought
అభివృద్ధి శ్రామికుడు ఎమ్మెల్యే ఆల
తెలంగాణ ఏర్పాటుకు ముందు, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గెలుపొందకముందు నియోజకవర్గం లో అంతా కరువు నిలయంగా ఉండేది. పక్కనే కృష్ణానది ఉన్నా తాగుసాగు నీరు ఉండేది కాదు.
నేడు ఎమ్మెల్యే ఆల జన్మదిన వేడుకలు
మూసాపేట, సెప్టెంబర్ 29 : తెలంగాణ ఏర్పాటుకు ముందు, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గెలుపొందకముందు నియోజకవర్గం లో అంతా కరువు నిలయంగా ఉండేది. పక్కనే కృష్ణానది ఉన్నా తాగుసాగు నీరు ఉండేది కాదు. కానీ దేవరక ద్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మరుసటి రోజు నుంచే ఏలాగైనా సాగునీరు అందించాలనే తపన ప డ్డాడు. అందుకు సంబంధించి రాత్రి పగలు తేడాలేకుండా శ్రమించాడు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రులు కేటీఆర్ హరీశ్‌రావు సహకారం, జిల్లా మంత్రుల చేయూతతో నేడు దేవరకద్ర, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, కొత్తకోట, మదనాపూర్ మండలాలకు వీలైనంత వరకు సాగునీరు అందించారు.
రైతులు పంటలు పుష్కలంగా పండించుకుంటున్నారు.
మరో వైపు అభివృద్ధిలోనూ అన్నీ నియోజకవర్గాల కంటే ఎక్కువగా పనులు చేపట్టడంతో అభివృద్ధి శ్రామికుడిగా ఎమ్మెల్యే ఆలకు పేరు వచ్చింది. స్వయంగా మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా వెంకన్న వచ్చిండంటే ఏదో చిట్టా తెచ్చిండనే వరకు వారిలో ఆలోచనలు వచ్చాయంటే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంత శ్రమిస్తున్నాడనేది అర్థమవుతుంది. అందుకే ఆయన వెంటే మేమంతా ఉంటామని అన్ని పార్టీలను వీడి పలువురు ఎమ్మెల్యే ఆల సమక్ష్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం అందుకు
నిదర్శనం.
ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువగా ప్రజల మధ్యలో ఉండె ఎమ్మెల్యేగా ఆలకు పేరుంది. ఎవరు ఆపదలో ఉన్న వారు ఏ పార్టీ వారు అయినా సరే వారికి వెంటనే స్పందించి సహాయం చేయడంలో ముందుంటారు. నేడు ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఘనం గా నిర్వహించాలనే సంకల్పంతో దేవరకద్ర నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికి అక్కడ కెక్ కటింగ్‌లు, రక్తదానాలు, అన్నదానాలు, పండ్ల, స్వీట్ల పంపిణీ కార్యక్రమాల చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద దవాఖాన సౌజన్యంతో పది రకాలు వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులచే మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.