రైతు శ్రేయస్సే ముఖ్యం
- కర్షకుల కోసం ప్రతిక్షణం శ్రమిస్తాం
- కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి
- క్వింటాకు రూ.1,960 మద్దతు ధర
- కేంద్రం మాయమాటలు నమ్మొద్దు
- క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21 : ప్రజలతోపాటు రైతు శ్రేయస్సే తమకు ముఖ్యమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్య వసాయ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సం క్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. అందుకే నిరంతర విద్యుత్, రైతుబీమా, రైతుబంధుతోపాటు మరిన్ని పథకాలతో అన్నదాతకు అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనేందుకు కేంద్రం ససేమిరా అన్నా.. రాష్ట్ర ప్రభుత్వం కొం టామని ముందుకొచ్చిందన్నారు. క్వింటాకు రూ.1960 చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పా రు. తేమ, మట్టిపెళ్లలు లేకుండా ధాన్యం తీసుకురావాలన్నారు.
మోదీ సర్కార్ మాటలను నమ్మొద్దని, ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుందన్నారు. ఒక్కో రాష్ర్టానికి ఒక్కో విధానం తీసుకొచ్చి వన్ నేషన్.. వన్ ట్యాక్స్ అంటూ ప్రజలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ఉత్పత్తులను కేంద్రం కొనాల్సి ఉన్నా.. తప్పించుకుంటుందని విమర్శించారు. అనంతరం పట్టణంలోని చేనేత ఎక్స్పో వద్ద నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్‌కు, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. అలాగే శ్రీనివాసకాలనీకి చెందిన శ్రీనివాసులుకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.2.50 లక్షల చెక్కును హైదరాబాద్‌లోని క్యాం ప్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమాల్లో కలెక్ట ర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవా ర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్ ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు.
అధికంగా ఉద్యోగాలు సాధించాలి..
నిరుద్యోగులకు ఉచితంగా అత్యుత్తమ కోచింగ్ అం దజేస్తామని, అభ్యర్థులు అత్యధికంగా గ్రూప్స్‌లో ఉద్యోగాలు సాధించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని చేనేత ఎక్స్‌పోలో శాంతానా రాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సహకారంతో ఏర్పాటు చేసిన గ్రూప్స్ ఉ చిత కోచింగ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏ ర్పడ్డాక లక్షా 33 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేలా 95 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు గుర్తు చేశారు. ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతామన్నారు. ఉచిత కోచింగ్‌తోపాటు మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌లో వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ సీతారామారావు, కోర్స్ డైరెక్టర్, మాజీ డీఈవో విజయ్‌కుమార్ ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

