వనపర్తి : జిల్లాలోని అమ్మడవాకుల బీఆర్ఎస్ నాయకుడు (BRS leader) , మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్గౌడ్ ( Sundergoud ) ను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గౌనికాడి రాములు యాదవ్ ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రిలో వెన్నుముక చికిత్స పొందుతున్న ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని వైద్యులతో సంప్రదించారు. జరిగిన గాయానికి శస్త్ర చికిత్స అవసరం ఉందన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ శ్యామ్ సుందర్ గౌడ్ కు మనోధైర్యం కల్పించి త్వరగా కోలుకుని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.