అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..
రైతులు ఎవరూ అధైర్య పడవద్దని మీకు అండగా ఉం టానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని ఉండవల్లి స్టేజి సమీపంలో శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లు లో సమ్మె కారణంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చేశారు. పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం రావడంతో ఎమ్మె ల్యే విజయుడు సాయంత్రం కాటన్ మిల్లు దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడారు.
- రైతులతో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ చౌరస్తా, నవంబర్ 17 : రైతులు ఎవరూ అధైర్య పడవద్దని మీకు అండగా ఉం టానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని ఉండవల్లి స్టేజి సమీపంలో శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లు లో సమ్మె కారణంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చేశారు. పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం రావడంతో ఎమ్మె ల్యే విజయుడు సాయంత్రం కాటన్ మిల్లు దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడారు.
దీంతో ఆయన మార్కెటింగ్ అధికారులతో, జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించి కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె ఉంటే అధికారులు ముందస్తుగా రైతులు సమాచారం అందించాలని అలా కాకుండా మీ ఇష్టానుసారం నడుచుకుంటామంటే సరిపోదని హెచ్చరించారు. రోజుల తరబడి స్లాట్ బుక్ చేసుకుని పత్తిని అమ్ముకుందామని ఇక్కడికి వస్తే సమ్మె పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఎలా అని అధికారులను ప్రశ్నించారు.
సమ్మె ఉందని ముందే రైతులకు సమాచారం ఇస్తే రైతులు ఇక్కడి వచ్చి ఇబ్బందులు పడరని అన్నారు. తేమ శా తం అంటూ, సమ్మెలంటూ ప్రతి నిత్యం రైతులను ప్రభుత్వం, అధికారులు వేధిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని రైతులను ఇబ్బందులు పెడితే సహించే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం దగ్గరుండి మిల్లులోకి తీసుకెళ్లి కొనుగోలు చేయించారు. పత్తిని కొనుగోలు చేయడంతో ఎమ్మెల్యేకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, గజేందర్రెడ్డి, గోపాల్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

