మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Sep 16, 2020 , 03:12:23

బాల భవన్‌కు స్థలం పరిశీలన

బాల భవన్‌కు స్థలం పరిశీలన

నారాయణపేట టౌన్‌ : పట్టణంలో బాలభవన్‌ నిర్మాణం కోసం మంగళవారం కలెక్టర్‌ హరిచందన స్థలాన్ని పరిశీలన చేశారు. పట్టణంలోని  టీచర్స్‌ కాలనీ, మార్కెట్‌ ఏరియాలో ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్‌ ఈ స్థలాలే కాకుండా ఇతర స్థలాలను పరిశీలించి ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఇతర స్థలాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, డీఆర్డీవో కాళిందిని, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, నాయకులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను క్లియర్‌ చేయాలి

జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను 3 రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో ఇంటర్‌, డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఆయా కళాశాలల వారీగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2017 నుంచి 2020 వరకు జిల్లాలోని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను క్లియర్‌ చేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo