తల్లీ! నిన్ను దలంచి…
ప్రవాహంలో మట్టిగడ్డలా కొట్టుకుపోకుండా జ్ఞాన శిఖరమై ప్రవాహ గతిని మార్చావు పాదాలు నెత్తురోడుతున్నా ముళ్ల కంచెల మీదే ముందుకు నడిచావు రాళ్ల తుపాను చుట్టుముట్టినా పేడ ముద్దలు వెక్కిరించినా అక్షరం దిశగానే చూపు సారించావు...
- నేడు సావిత్రీ బాయి పూలే వర్ధంతి సందర్భంగా..
ప్రవాహంలో మట్టిగడ్డలా కొట్టుకుపోకుండా
జ్ఞాన శిఖరమై ప్రవాహ గతిని మార్చావు
పాదాలు నెత్తురోడుతున్నా
ముళ్ల కంచెల మీదే ముందుకు నడిచావు
రాళ్ల తుపాను చుట్టుముట్టినా
పేడ ముద్దలు వెక్కిరించినా
అక్షరం దిశగానే చూపు సారించావు…
‘ఆకాశంలో సగం’ నిండా
ఆవరించిన అమావాస్యలను చెరిపివేసి
శూద్రావనిలో సూర్యోదయమయ్యావు
బడికి ‘మడి’గట్టిన ఛాందసవాదాన్ని ధిక్కరించి
ఒడినే బడిగా మలచి
బతుకు విలువను బోధించావు…
పురాతన శృంఖలాలను ఛేదించి
అణగారిన జాతి గొంతులో
విముక్తి గీతమై ప్రతిధ్వనించావు…
మొగ్గకూ మోడుకూ మధ్య అల్లిన పెనుబంధం
పుటుక్కున తెగిపోయినపుడు
రగిలిన వేదనాగ్నిలో రహస్యంగా పురుడు పోసుకున్న
ప్రాణ దీపాలను గుండెలకు హత్తుకున్నావు…
సత్యశోధనా పథంలో
సాంస్కృతిక విప్లవ జ్యోతివై ప్రజ్వలించావు..
కాలం మారింది కానీ
కొత్త కొత్త నేరాలూ ఘోరాలు
ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి తల్లీ!
ఇప్పుడు మేము తరగతి గదికి బొట్టుపెట్టి
పాఠాలకు పాత రంగులు వేస్తున్నాం
చరిత్ర చెవుల్లో సీసం పోస్తున్నాం
సమన్యాయం నాలుక మీద
కుటిల బీజాలు నాటుతున్నాం
తాళం వేసి, గొళ్లెం మరచినట్టు
సంవిధానాన్ని విస్మరించి
ప్రజాస్వామ్యానికి
తాత్పర్యం వల్లిస్తున్నాం.
కేవలం దేవుడి దయవల్ల
మనిషి అంతరిక్షం మీద
అడుగుపెట్టాడని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం
ఈ తిరోగమన తిమిరంలో…
కొడిగట్టిపోతున్న మాకు
ఇప్పుడు హఠాత్తుగా
ఒక తాత్విక చైతన్యం కావాలి!
తల్లీ! చదువుల జాబిల్లీ!
మమ్మల్ని నీ పాఠశాలలో చేర్చుకొని
పిడికెడు జ్ఞాన భిక్ష పెడతావా? ప్లీజ్…
– 94404 80274
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

