కలిసిరాని కాలం
కడుపు మండుతుంది తెలంగాణ అభిమానం నిలబడనిస్తలేదు నక్క సిగ్గుపడే ‘నారా’కు ఘన స్వాగతాలు అరాచకాన్ని అడ్డుకుంటే అరదండాలు
కడుపు మండుతుంది
తెలంగాణ అభిమానం నిలబడనిస్తలేదు
నక్క సిగ్గుపడే ‘నారా’కు ఘన స్వాగతాలు
అరాచకాన్ని అడ్డుకుంటే అరదండాలు
మేధావుల తలలు తాబేలు డిప్పలో
జయశంకర్ సార్ అన్నది నిజమైంది
ప్రాంత సోయి లేని వారంతా
రొమ్ము విరుచుకుని తిరుగుతున్నరు
తెలంగాణ వీరులు అమర్యాదతో
అలమటిస్తూ మూగగా రోదిస్తున్నరు
పదేళ్ల స్వరాష్ట్రంలో చూసిన స్వర్గం
కలలాగా టక్కున మాయమైంది
పొలాలు ఎండినై గుండెలు మండుతున్నై
పదవులు పొందిన మాజీలు పదవులకై
పరువు పొయ్యేట్టు పరుగు తీస్తుంటే
నమ్మి ఓట్లేసిన జనం చేష్టలుడిగి చూస్తుంటే
పెరుగుట విరుగుట కొరకే
ఎక్కువైన ఏదైనా మురిగిపోక తప్పదు
కాలం ఒకటున్నది లెక్క చూడక ఉండదు
– భోజన్నగారి అనసూయ
Read Today's Latest Literature-more Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

