పుస్తకాలు లేని పాఠశాల మా నాయన
తెల్లవారకముందే పొగమంచులో కలిసిపోయి పంట పొలాల్లో వాలిపోయే మా నాయన ఆకాశంలో నక్షత్రాలు వెలిగే సమయానికి భూమి మీద మా నాయన అలసిన అడుగులు ఇంటిదారి పట్టేవి.
తెల్లవారకముందే
పొగమంచులో కలిసిపోయి
పంట పొలాల్లో
వాలిపోయే మా నాయన
ఆకాశంలో నక్షత్రాలు
వెలిగే సమయానికి
భూమి మీద మా
నాయన అలసిన అడుగులు
ఇంటిదారి పట్టేవి.
చీకట్లో పనేమిటని అడిగితే,
మన జీవితాలు చీకట్లోనే
తెల్లారుతాయని
చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు.
చేనులో శరీరం చెమటోడ్చినా,
మనసు మాత్రం
కొట్టంలో కట్టేసిన ఎద్దుల దగ్గరో,
ఆవుదూడల గడ్డిమీదనో,
వాలిపోయి ఉండేది.
తాను తిన్నా తినకపోయినా,
నలుగురి ఆకలి ముందు
తన ఆకలిని మడిచేసేవాడు.
బతుకులో తుపాన్లు వచ్చినా,
భయానికి చోటివ్వక,
సమస్యల కళ్లలో కళ్లేసినిలబడటం
నేర్పిన వాడు మా నాయన.
కలుపులా ఎన్నాళ్లు నిలవడం కాదు,
పంటలా పది రోజులు
పలుకుబడి ఇవ్వడమే
జీవితమని చెప్పేవాడు మా నాయన.
ఏ బడిలో చదివితే
ఇంత గొప్ప తత్వం వస్తుందో అని
అదే పనిగా ఆశ్చర్యపడేవాడిని
కానీ ఇప్పుడు అర్థమైంది,
అతని పాఠశాల చేనూ,
చెమట, ఆకలే.
అతని గురువు జీవితమే
అదీ మా నాయన.
-బసడ సంపత్ యాదవ్ ,70321 32593
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

