స్త్రీల భాష తెలిసిన గాజుల నగరం మాది
గజ్జెలు, మువ్వలు, కట్టుకొని గండిపేట నుండి గాలి వీస్తుంది గుండెలాంటి గోల్కొండ మాకు అండగా ఉందని చెప్పింది
గజ్జెలు, మువ్వలు, కట్టుకొని
గండిపేట నుండి గాలి వీస్తుంది
గుండెలాంటి గోల్కొండ
మాకు అండగా ఉందని చెప్పింది
ఆకాశం ఎత్తున్న చార్మినార్
అమ్మలాగా పక్కపక్కనే నడుస్తుంది
జలతారులా వర్షం కురిసి,
హార్మోనియం పదనిసల రాగాలై,
నలువైపులా మెట్లను పులకింపజేస్తుంది
‘జూపార్క్’ ఉంది, ‘ఫలక్‌నుమా’ ఉంది,
‘బాగే ఆమ్’ దాటితే ‘హైటెక్ సిటీ’ ఉంది
అది దాటి వెళితే, డాలర్ ఏరియా దర్జా ఉంది
మేము ఎప్పుడూ ఒంటరిగా లేము,
మాకు తోడు, పోరాటాల వారసత్వముంది
ముత్యాల బజారు మాది
స్త్రీల సంభాషణ తెలిసిన
గాజుల నగరం మాది
పువ్వులను ఊరేగించే
మెత్తని మనసు మాది
మనుషులను కలిపే
ట్యాంక్‌బండ్ సాయంత్రం మాది
రంగులు మా పండుగలు
రణరంగంలో కూడా-
మరిచిపోలేని మా పాటలు
ఉదయాస్తమయాలకు తెలుపండి
మేము ఒంటరిగా లేము
చెదిరిపోని స్వప్నాల పురాతన వైభవముంది
‘కాలాపహాడ్ కానీ,
‘నౌబత్ పహాడ్ కానీ,
వీధుల్లో చుక్కల్లా వెలిగే దీపాల్లో కానీ,
విజయాల నవ్వుల శోభ మాకుంది
హంసల్లా తిరిగే మేఘాలు
మెరిసే నదుల్లా రింగ్ రోడ్లు
పొదలు దాటిన, లేడి పరుగుల్లా పొలిమేరలు
మేము ఒంటరిగా లేము
హారతుల ఉదయాలు,
ఊదుపొగల సాయంత్రాలు
సామరస్యం మీద
నమ్మకాలు మాకున్నాయి
బంజారాహిల్స్‌ను దాటిపోయిన నగిషీలు,
విల్లాల కమాన్లు హరివిల్లులా ఉన్నాయి
బస్తీల్లో పిల్లలు, కలిసి ఆడుకొనే
బంధాలు మాకున్నాయి
రాత్రీపగలూ బాజాభజంత్రీలతో
‘పల్లకీలా’ తిరుగుతున్న మెట్రోరైళ్ల దృశ్యాలు
నగరమంతా ‘బరాత్’
సందడిని తలపిస్తున్నాయి
ఈ జమానాకు చెప్పండి
మేము ఒంటరిగా లేము,
ఆలోచనల అల్లికలా దారులు కలిసే,
ఆర్ట్ గ్యాలరీల్లా వంతెనల చిత్రకళలున్నాయి
‘జామ్‌బాగ్’కు దగ్గర్లో
మొజాంజాహీ మార్కెట్ రాతికోట ఉంది
ఆ-ఆశ్చర్యానికి, దిగంతాలను
శాసించే సొగసుంది
మేము ఎప్పుడూ ఒంటరిగా లేము
గుమ్మరించిన మనసులు, మమతలు,
క్లాక్‌టవర్ ఎత్తంత పూలగుంపులు
ఆయుధాలు కేవలం మెరవడానికే కాదు,
గెలవడానికి భరోసా కూడా ఇస్తాయి
మనసును, కలలను జాగరూకం చేసే,
ఆయుధాగారంలా ‘మ్యూజియం’ ఉంది
కలవరపెట్టే తుఫాన్ కాలంలో
కళ్లు బెదరని గొప్ప చరిత్ర మాకుంది
మేము తెలంగాణ ప్రజలం
ఇక్కడ ఒంటరిగా లేము
ఇక్కడ, అమరుల అడుగుల మట్టి ఉంది
మా వెంట హైదరాబాద్ ఉంది
ఏనుగు అంబారీలా
గంభీరమైన అందముంది
మైలురాయి మీది పిట్టలా, ఒంటరిగా లేము
సాంస్కృతిక మేళతాళాల వేడుకుంది
మా సంస్కారం మాకు తోడుగా ఉంది,
మేము ఒంటరిగా లేము
– ఆశారాజు 9392302245
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

