గణిత విజ్ఞాన కల్పవృక్షాలు
ఆధునిక గణితంలో భావన అనేది ఉండదు. సూత్ర రూపకల్పనలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పద్యాల్లో గణ ధర్మాలు గణితం అయితే మనోభావన లోక రీతులు, వేద పురాణేతిహాసాల కథలు మొదలైనవి.
పద్యంలో పద్యం-2
ఆధునిక గణితంలో భావన అనేది ఉండదు. సూత్ర రూపకల్పనలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పద్యాల్లో గణ ధర్మాలు గణితం అయితే మనోభావన లోక రీతులు, వేద పురాణేతిహాసాల కథలు మొదలైనవి. ఇలా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే మానసిక ఆనందం మనోహరంగా ఉంటుంది. జ్ఞానం హింసారహితంగా పది మందికి ఉపయోగపడుతుంది.
కొందరు తెలుగు కవులు పద్యంలో పద్యం అంటూ కందగీతగర్భచంపకమాల పద్యాదులను కూడా రాశారు. ఈ పద్యాలను చూసి, పద్య మూలాలు ఎరుగని కొందరు ఆధునిక కవులు కవిత్వంలో ఈ సర్కస్ ఫీట్లు ఎందుకండి? అని అంటారు. నిజానికి ఇవి సర్కస్ ఫీట్లు కావు. గణిత విజ్ఞాన కల్పవృక్షాలు. మేధో సామర్థ్యాన్ని వివిధ కోణాల్లో పెంచే విద్యా వినోద ప్రక్రియలు. ఆధునిక గణితంలో ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్‌లో ఏ ప్లస్ బీ హోల్ స్కేర్ ఉందని చెప్తుంటారు. గణిత పరిజ్ఞానం ఉన్నవారు అలా చెప్పడం పెద్ద విశేషం కాదు. కానీ, ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్‌లో దానికి సరిసమానమైన మరో గణిత సూత్రం ఉందని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. మన తెలుగు గర్భ కవిత్వంలో ఆ విషయం ఏనాడో చెప్పారు. అదే కందగర్భమణిగణ వృత్తం. కందగర్భమణిగణ వృత్తంలో కంద పద్య లక్షణాలు, మణిగణవృత్త పద్య లక్షణాలు రెండూ ఒకే స్థాయిలో సాగుతాయి.
ఛందోశాస్త్ర మూలాలు కనీసం కొన్నైనా నేటి విద్యా ప్రపంచంలో వ్యాపించి ఉంటే నేటి విద్యా ప్రపంచం మరొక విధంగా ఉండేది. ఇంకా ఆ మూలాలు విద్యా ప్రపంచంలో వ్యాపించకపోవడం వల్ల ఇటు తెలుగు సాహిత్యం హేళనకు లేదా కేవలం పరీక్షలకు పరిమితమవుతుంటే అటు మన ఛందో గణిత మూలాలు మరో రూపంలో విద్యా ప్రపంచంలోకి వస్తున్నాయి. కడకు మనం భావ దారిద్య్రంతో, జ్ఞాన దారిద్య్రంతో తలవంచుకోవలసి వస్తుంది. ‘కథలు తెలుసుకోవడానికి పద్యాల మీద కుస్తీ పట్టనవసరం లేదు. ఆయా కథలను వచనంలో ఉన్న పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆపై పరీక్షల ముందు ఏదో ఒక గైడ్ లేదా మెటీరియల్ పట్టుకుంటే ‘పరీక్షలో పాస్ మార్కుల కంటే ఎక్కువే వస్తాయ’నే భావనకు విద్యార్థులు వచ్చేశారు.
నిజం చెప్పాలంటే నేటి విద్యార్థులు పాత తరం వారికంటే ఎక్కువగానే విద్యాభ్యాసం చేస్తున్నారు. విజ్ఞాన సముపార్జన చేస్తున్నారు. అందుకే వారి మేధస్సును, కాలాన్ని కరిగిస్తున్నారు. కాకుంటే ఆ అభ్యాసం తెలుగు భాష మీద ఉండటం లేదు. దీనికి కారణం నేటి విద్యార్థులు తెలుగు అంటే చులకనభావంతో ఉన్నారనడం సమంజసం కాదు. తెలుగు పద్య పునాదిలో ఉన్న గణిత ఛాయను ఒడిసి పట్టుకుంటే పద్యంలో పద్యం పవర్ ఏమిటో ఈ తరం విద్యా ప్రపంచానికి తెలుస్తుంది.
ఇక వేద ఛందస్సు మంత్రాల్లోని ఉదా త్తానుదాత్తాది స్వరాల లెక్క కూడా చెప్తుంది. ఉదాహరణకు అగ్ని మీళే అనే అక్షరాలు తెలుగు ఛందస్సు ప్రకారం ఏడు మాత్రలవుతాయి. అదే ఉదా త్తానుదాత్త స్వరాలను అనుసరించి వేద ఛందస్సు ప్రకారం తొమ్మిది మాత్రల వరకు అవుతాయి. అప్పుడు అక్కడి గణిత లెక్కలు మారిపోతాయి. ఈ పథాన మన ఛందో శాస్త్రం ముందుకువెళ్తే విద్యార్థులు ఇటు ఛందస్సును అటు ఆధునిక గణితంలోని కొన్ని అధ్యాయాలను ఏకకాలంలో నేర్చుకుంటారు.
పద్యంలో పద్యం వంటి ప్రక్రియలు విద్యార్థుల గణిత మేధో సామర్థ్యాన్ని, మనోభావ సామర్థ్యాన్ని ఏకకాలంలో సశాస్త్రీయంగా పెంచుతాయి. ఆధునిక గణితాది శాస్ర్తాల అభ్యాసంలో జ్ఞాపక శక్తికి తప్ప మనోభావాలకు తావు లేకపోవడంతో అలాంటి అభ్యాసం ఎక్కువ శాతం హింసాతత్వాన్ని పెంచుతుంది. మన పద్యంలో పద్యం వంటి అభ్యాసాలు హింసాతత్వాన్ని తగ్గిస్తాయి. మానవత్వాన్ని పెంచుతాయి. నైతిక విలువల మూలాలను ఈ తరం ముందుంచుతాయి.
ఇదిలా ఉంటే తెలుగులో గర్భ కవిత్వమే గాక బంధ కవిత్వం కూడా ఉంది. బంధ కవిత్వంలో వీణా బంధ శార్దూలము, రథబంధ శార్దూలము, షోడశదళ చక్రబంధము వంటి బంధ కవిత్వం ఉంది. మెట్‌పల్లికి చెందిన శ్రీమాన్ శిరశినహళ్ కృష్ణమాచార్యులు వారు చిత్రప్రబంధం అనే పేరుతో శతవిధ బంధ కావ్యాన్ని రాశారు. అందులో చిత్రపటాలతో సహా తెలుగు పద్యాలుంటాయి.
వీటివల్ల విద్యార్థుల మేధోస్థాయి మరింత వికసిస్తుంది. భారతీయ కళారూపాల దృశ్యాలు వాటి గణ ధర్మాలు విద్యార్థులకు తెలుస్తాయి. వేద ఛందస్సును అటుంచి, కనీసం తెలుగు పద్య మూలాల్లోకి వెళ్తే ఆధునిక విద్యా ప్రపంచాన్ని తోసిరాజు అనగల జ్ఞానం, శక్తి, ఆకర్షణ, అవసరం మన తెలుగు పద్యంలో పద్యానికి ఉంది.
వాగుమూడి
లక్ష్మీ రాఘవరావు
98494 48947
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

