నోరార చవులూర
మాటలాడు మనుషుల
పల్లె తనపు దృశ్య కావ్యం
తెలంగాణ సజీవ చిత్రం
సమస్త వృత్తుల వెలుగుల్లో
నాగలి ఎత్తిన రైతన్నకు
తోడు నీడై నడిస్తే చాలు
బారెడు జుత్తల కాడెడ్లు
మొలకెత్తే విత్తనాల తడితో
పొడి పొడి దుక్కులన్నీ
కంటి నిండా పరుచుకుని
పరువాల పచ్చదనం విరియ
అవ్వ అయ్యా వదిన బావా
అన్నా అక్కా కొడుకు బిడ్డల
అలై బలై పలకరింపులు
ఆత్మీయ రాగ విపంచియై సాగు
తీరొక్క పిలుపుల కమ్మదనం
వావి వరుసల కలుపుగోలుతనం
అరమరికలు లేని అర్చుకునే తత్వం
కష్ట సుఖాలలో తోడు ఉండే నేస్తం
నాగరికతకు అర్థం తెలియని
అక్షరజ్ఞానం లేనిరోజులకు ముందే
సమభావన సహజీవన ధర్మం
తెలిసి మురిసిన శ్రమ సౌందర్యం
నుడికారపు పలుకుబ
డులతో మానవీయసామెతల సొబగులతో పూచిన
మమతల పుష్కరిణి
పదహారణాల పసిడి తెలంగాణ
నోరార చవులూర
మాటలాడు మనుషుల
పల్లె తనపు దృశ్య కావ్యం
తెలంగాణ సజీవ చిత్రం
పొట్లపల్లి శ్రీనివాసరావు
98492 54078