అస్పృశ్య వైరస్‌కు వ్యాక్సిన్

ఇరుకు సందుల్లో
బతుకు తొవ్వల తావున
ప్రాణవాయువు సిలిండర్ అమర్చిన తీరు
దళితులకు ఊపిరి పీల్చ వెసులుబాటు
‘బంధు’ భరోసా..
అంటబడనితనం ఎడారిల
కుల బొగ్గుపుల్సు విషం తావున
పస్క మొలక బయిల్ల
పచ్చ పర్పు పసిడి పుష్కలమైన
జీవ వాయుధారా
ఆత్మబంధువు పలకరింపు..
అంటరాని అగ్గి మంటలు ఎగిసి పడుతున్నతాన
మనిషితనం విరాజిల్లే తంత్రం
ప్రజ్ఞ సమతా ఆలోచనల వెల్లువలో
ఫలప్రదమైన
సుట్రికమైన జీవబంధం
‘దళిత బంధు’
ఒక ఆత్మీయ బంధుత్వం..
అంటబడని చీకటి అగాథంల
వంటరైన దీనావస్థ
మహానగరం పొత్తిట్ల
కాంక్రీట్ పిల్లర్ల ఎడారుల్లా
చెదిరిన పక్షి గూళ్ళయిన
ముర్కీస్లమ్ములు
పల్లె స్వరాజ్య వాడలు రూపుమారి
పట్టణ మురికివాడలై వెలిసిన తాన
రొచ్చు గుంతల సాపులోమునిగి మరణించే
జీవనోపాధికి వీడ్కోలు జెప్పి
‘దళిత బంధు’ జీవనానికి ఎదుర్కోలు పలికె దశ!
పగ వట్ట కుండానే
ప్రాణం తీసే వైరస్‌కు వాక్సిన్ కనుగొన్నతాన
రూపు రీతి మారిన వివక్షకు వ్యాక్సిన్
నిద్దా, కావాల్సిందే!
స్మార్ట్గ తయారైన కులం కత్తి
దుర్ ధర్మ రొచ్చుకాలువల్లో
ముంచి చంపేస్తున్నపుడు
అర్ధాయుస్సు పీడల్ల
శతాబ్దాలుగా ముంచుతున్న
అస్పృశ్య కుల వైరస్‌కు
ఓ మంచి వ్యాక్సిన్ ‘దళిత బంధు’..
అదను చూసి
ఇమ్యూనిటీ పెంచే ఉపాధికి చేరువై
విజ్ఞాన పరిమళ జీవశైలితో
అలాయ్ బలాయ్ తీసుకుని
బిడ్డల బంగారు భవిష్యత్‌కు
‘దళిత బంధు’
నిండు పున్నమి భరోసా..
రాష్ర్టానికి ఆసాంతం కీర్తి కిరీటం..!
డాక్టర్ గోగు శ్యామల
98669 78450
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

