ముగ్గురు కళాకారులు

ముఖానికి బొట్టు పెట్టుకుంటున్న ఆమె అసంతృప్తితో వేగిపోతోంది. బొట్టు ఆకారంలో పరిపూర్ణత రాలేదని ఆమె బాధ. చూపుడు వేలుకు గుడ్డను చుట్టి మనసును పని మీదనే నిలుపుతూ, అవసరమున్న చోట తడుపుతూ, పల్చగా ఉన్నట్టనిపించిన చోట మరింత బొట్టునద్దుతూ, చాలా సేపటికి పరిపూర్ణమైన ఆకారాన్ని సాధించింది. ఇప్పుడామె కళ్లలో అనంతమైన వెలుగు..!
రోడ్డు పక్కన బల్లమీద బట్టల్ని ఇస్త్రీ చేస్తూ ప్రపంచాన్ని మరిచిపోయాడతడు. ఇస్త్రీ అయిపోయిన షర్టును పక్కనపెట్టి పరిశీలిస్తే, ఒకచోట చిన్న ముడుత.. దాన్ని మళ్లీ బల్లమీద పరిచి ఇస్త్రీపెట్టెను తిప్పాడు ఓ సారి. ఉహుఁ, ముడుత పూర్తిగా పోలేదు. వేళ్లను నీళ్లలో ముంచి ముడుత మీద చిలకరించి, పెట్టెను దానిమీద అదిమి పెట్టాడు కొంచెం సేపు. తర్వాత చూస్తే ముడుత మాయం! షర్టులాగే అతని కళ్లు తళతళలాడాయి!!
కవితను రాయడం పూర్తిచేసిన అతను కంటిచూపుతో దాన్ని స్కాన్‌చేసి, శ్రద్ధగా పరీక్షించాడు. నాలుగైదు పదాలను తీసేసి మరింత బాగా సరిపోయేవాటిని పెట్టాడు అక్కడ. కొన్నిపదాల స్థానాలను మార్చాడు. ఒక పంక్తిని కింది నుంచి పైకి జరిపాడు. మరో పంక్తిని తీసేశాడు. అట్లాగే ఒకటి రెండు పదాలను.. ఆఖరికి శీర్షికలో చిన్న మార్పు చేసి, అంతా బాగున్నదని ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడతని మనసు తేలిక పడింది. ఆనందంతో గాల్లో తేలి ఆడింది!
ఎలనాగ, 98669 45424
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

