లోపలా బయటా అన్నివైపులా, అంతా
ఎంత అస్తవ్యస్తంగా
ఎంత క్రమరహితంగా
అర్థంకాని దానిలా
ముక్కలు ముక్కలు అయిపోయిందో
అర్థం కావటం లేదు.
ఎలా ఉండాలి ‘భూమిక’ అని?
మొత్తం జగత్ అంతా
పొగమయం అయిపోయింది
చూడలేక పోతున్నాయి కండ్లు
గగ్గోలు వినలేక గడియలు పడిపోతున్నాయి
చెవులు అందరికీ ఉండడం
నిజాయితీ లేనట్టూ
రుచి లేనట్టూ ఉంటుంది.
విలువలు అడుగంటిపోయిన
ఇటువంటి సమయంలో
సోదరులారా!నన్ను క్షమించండి!
ఒకవేళ నేను ఇలా ప్రశ్నిస్తే
ఎటువంటి భూమిక ఉండాలి?హిందీ మూలం: డా.కైలాశ్ వాజపేయి
-తెలుగు అనువాదం: పారనంది నిర్మల
9985103804