2025, నవంబర్ 2వ తేదీ, ఆదివారం రోజున ఉదయం 10.30 గంటలకు మామిడిపల్లిలోని శ్రీ అపురూప వెంకటేశ్వరస్వామి కళ్యాణమండపంలో ‘అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు’, ‘ఇందూరు అపురూప అవార్డులు- 2025’ ప్రదానం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సి.మృణాళిని, విశిష్ఠ అతిథిగా వి.ప్రతిమ హాజరుకానుండగా సభాధ్యక్షురాలిగా నెల్లుట్ల రమాదేవి వ్యవహరించనున్నారు. ఈ రెండు సాహితీ సంస్థల నుంచి 2024, 2025లకు గాను వసుంధర, డాక్టర్ శాంతి నారాయణ, జి.వల్లీశ్వర్, డాక్టర్ నలిమెల భాస్కర్, జి.వెంకటకృష్ణ, డాక్టర్ పెద్దింటి అశోక్‌కుమార్, సూరారం శంకర్, పంచరెడ్డి లక్ష్మణ్, స్వయం ప్రకాశ్, ఎన్.విజయాకిషన్ రెడ్డి, కుసుమలతా రెడ్డి, వసంతా వివేక్, వి.నర్సింహారెడ్డి, పి.సుజాత, సుమీలా శర్మ, డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్‌లు అవార్డులు అందుకోనున్నారు. సాహితీ కళాభిమానులందరికీ ఆహ్వానం.
– డాక్టర్ అమృత లత, కిరణ్ బాల
కవిత్వ సంపుటాలకు ఆహ్వానం
తుల యాదయ్య స్మారక జాతీయ పురస్కారం-2025 కోసం కవిత్వ సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. సాహిత్యంలో విశిష్ట సేవలందించిన ఒకరికి జీవన సాఫల్య పురస్కారం కింద రూ.6,116ల నగదు, 2024లో ప్రచురించిన కవిత్వ సంపుటాలలో ఎంపిక కాబడిన ఉత్తమ సంపుటికి రూ.5,116ల నగదు, ప్రోత్సాహకంగా ఒక యువకవి ఉత్తమ కవిత్వ సంపుటికి రూ.2.116ల నగదుతో పాటు శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేస్తారు. యువ కవుల కవిత్వ సంపుటాలను రెండు కేటగిరీలలో పరిగణనలోకి తీసుకుంటాం. మీ కవిత్వ సంపుటం నాలుగు కాపీలు మాకు చేరవలసిన చిరునామా: తుల శ్రీనివాస్ ఇం.నెం.12-107/ ఏ, సంతోష్‌నగర్, నకిరేకల్, నల్లగొండ, తెలంగాణ-508 211. ఆఖరు తేదీ: 2025, డిసెంబర్ 31.
– తుల శ్రీనివాస్ 99485 25853 వట్టికోట ఆళ్వారుస్వామి సాహిత్య కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు
కథా పురస్కారం-2024
ప్రముఖ కథా రచయిత్రి స్వర్ణ కిలారి రాసిన ‘నల్ల బంగారం’ పుస్తకం ‘గూడూరి సీతారాం కథా పురస్కారం-2024’కి ఎంపికైంది. 2025, నవంబర్ చివరివారం సిరిసిల్లలో జరిగే సభలో రచయిత్రికి విశేష సత్కారం, ప్రశంసా పత్రంతో పాటు రూ.10,116లు అందజేయనున్నారు.
– మానేరు రచయితల సంఘం,గూడూరి సీతారాం ఫౌండేషన్