సన్నని దారం పడుగు పేకల మధ్యలో పోగుతో
నూలు కండె వారధిలా
మగ్గము నిరంతర శ్రామిక జీవైంది….
సమానత్వాన్ని పంచుతూ
ప్రపంచానికి దిక్సూచి చే‘నేత’
వేళ్ల మధ్యలో చీర
పూలతో సింగారించుకొని
జరీ అంచుల్లో అందమైన చీర
పదహారేండ్ల అమ్మాయికి
నిండుదనమైంది….
సంప్రదాయ కట్టు బొట్టుతో
ఏడు రంగుల హరివిల్లయి
గడప గడపలో నూలు దారం
మంగళ సాంస్కృతిక
వారసత్వానికి చిహ్నమైంది….
ఎలగొండ రవి
98487 70345