వసంత ఋతువు
పారుతున్న తేట నీళ్లను చూస్తే అమ్మ రొండిమీద మోసిన సొట్టలుపడ్డ బిందె గుర్తుకొస్తుంది
పారుతున్న తేట నీళ్లను చూస్తే
అమ్మ రొండిమీద మోసిన సొట్టలుపడ్డ బిందె గుర్తుకొస్తుంది
దుబాయ్ ముచ్చట్లు విన్నప్పుడల్లా
నాయిన ముఖం గుబుర్లోంచి ముందుకొచ్చిన
చింతకాయ గొడిశలా ఊగిపోయేది
ఊర్ల నమ్మకాలు కట్టమైసమ్మ గుడి గంటకు
చుట్టిన పసుపుతాడులా మెరిసేవి
ముడుతలు వడ్డ మనుషులు
కండ్లల్లో దీపాలు
వెలిగించుకొని చీకటి పడ్డ ఇంటిని చూసుకునేది
మొగులు రూపం మాడ్చుకునేది
పక్షులు బీరిపోయిన మట్టి ముఖాన్ని పదే పదే తట్టిలేపేవి
దుఃఖపు కొసలు నిరంతరం
ఉరితాళ్లను పేనుతున్నా
మట్టిగోడమీద మొలిచిన వేపచిగురు మిత్రుడై ధైర్యాన్నిచ్చేది
పక్కపొంటే నదిజాడ ఉన్నా
మదిల నీళ్లచప్పుడు వినపడేది కాదు
ఋతువులు విప్పిన ఛత్రీలా ఈ నేలమీద
నీడలైనప్పుడల్లా పర్రెలు పెట్టిన
పెసరత ఆశ ముడుపు కట్టుకునేది
పేరుకే ఒకే దేహం
ఒక భాగానికి ద్రోహం
ఆకలితో కొసరినప్పుడల్లా
కసిరిన పెదవే గుర్తుకొస్తుంది
అరుగులమీద అమావాస్యలు ఆకుల్లా రాలిపోయేవి
పున్నమలు మెతుకులకోసం
వాగిసకలో లెంకులాడేవి
రోకు మారింది
మట్టి గెట్టు పెట్టుకున్నది
కోరిక పాలపిట్టయ్ ఆకాశంల
సింగిడీ ని గీసింది
వలస కాళ్ళు పచ్చదనం పసరు పూసుకొని
పొలంల నాట్లేస్తున్నయి
నీళ్లు పదేండ్ల జాతర్ల తలకువోసుకుంటున్నయి
ఊర్లు పోషమ్మ చేసుకుంటున్నయి
– వేముగంటి మురళి
96765 98465
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- editorial news
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

