ఈ ఫలితం
జగమెరిగిన సత్యమే
మునుగోడు ప్రజలు
టీఆర్ఎస్ను
బీఆర్ఎస్గా
ఆశీర్వదించారు
అమూల్యమైన ఓట్లేసి
కారు జైత్ర యాత్రకు
పునాది రాయి వేశారు..
ఇక మునిగిపోయే
వారంతా
రోజులు
లెక్కించాల్సిందే!
చిత్తశుద్ధి కలిగిన
ప్రభుత్వాలేవో
ప్రగతి ఫలాలందించే
అక్షయ పాత్ర ఏదో
ప్రజలకు తెలియదనుకోవడం
అమాయకత్వమే
అవుతుంది!
బీఆర్ఎస్కు పురుడు
పోసిన తెలంగాణ నేత
కేసీఆర్ను
దేశ ప్రజలు
అభిమానంతో ఆదరించి
దేశానికి చంద్రుడిగా
ఆవిష్కరించడానికి
సంసిద్ధంగా ఉన్నారు!
తెలంగాణ రాష్ట్రం
భారతదేశానికే
దిక్సూచి కాబోతున్నది..
డబ్భు ఏళ్ళుగా
జనులకు ఏమీ చేయని
ప్రతిపక్షాలకు
ఇంక మిగిలేది
శుష్కప్రియాలే
శూన్య హస్తాలే..!
డాక్టర్ గన్నోజు ,శ్రీనివాసచారి
85558 99493