ఎత్తు పల్లాలను దాటుకుంటూ
ఏపెత్తు విధి విధానాల సమభావంతో
ఒడిదుడుకుల గమ్యాలలో
ఓర్పును కూడగట్టుకుని
సమసమాజ నిర్మాణ బాటలో
అవరోధాలను అధిగమించుకొని
సమగ్రమైన పాలన సవ్యంగా
సాగిపోతూ ఉంటుంది
చిరునవ్వుల సమాజ వికాసానికి
అలుపెరుగని పోరాటంతో
కరిగిపోతున్న కొవ్వొత్తిలా
తరలిపోతున్న కాలాన్ని పట్టుకొని
నిర్విరామంగా అడుగులేస్తుంది
కంటి నలుసుల తిప్పలను
పంటి బిగువున అదిమిపెడుతూ
సగటు ఇంట్లో చిరు దివ్వెలను
వెలిగించే పనిలో మునకలేస్తుంది
క్షణం క్షణం విచక్షణా మార్గంలో
అనుక్షణం బడుగు జీవన అభ్యున్నతిలో
అలసిపోకుండా శ్రమిస్తుంది
సాదకబాధల విన్యాసంలో
నలుమూలల పరిశోధన తీరులో
వ్యయప్రయాసల సమరీతిలో
సమగ్ర పాలిత కొలతల సమభావం
సుందరీకృతమౌతుంది
సుప్రయోజనాల శుభోదయంగా
సఫలీకృతమౌతూ వెళ్తుంది
ప్రజానాడీ వ్యవస్థ పరిశోధనలో
తనకు తానుగా చేయూతనిస్తుంది
సమగ్రతమైన పాలనకు
పట్టాభిషేకం సమగ్రంగా సలుపుతుంది.
నరెద్దుల రాజారెడ్డి
96660 16636