సువిశాల దేశంలో పసిబిడ్డ నా రాష్ర్టము
ప్రగతి స్వచ్ఛ రాష్ర్ట సాధనే మా లక్ష్యము
స్నేహభావం పెంచే బతుకమ్మ మా అస్తిత్వము
ఆరుపదుల పోరాటఫలితమే తెలంగాణము
(2) ॥విశాల॥
సారవంతమైన సాంస్కృతి మాకు వారసత్వము
బతుకమ్మ బోనాలు అందు ముఖ్యము
జాతి ఐక్యతను పెంచే ప్రదేశము నా రాష్ర్టము
ఆరు పదుల పోరాటఫలితము తెలంగాణము
(2) ॥విశాల॥
పేరిణి శివతాండవం యుద్ధవీరుల విన్యాసము
కాకతీయుల నుండి అందిపుచ్చుకున్న వారసత్వము
స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన అది వీరనాట్యము
ఆరు పదుల పోరాటఫలితము తెలంగాణము
(2) ॥విశాల॥
ప్రకృతిని ఆరాధించడమే బోనాలు బతుకమ్మలు
ప్రకృతి ప్రకోపాన్ని తగ్గించుట ధ్యేయము
పోతురాజు శివసత్తుల నృత్యము ఆకర్షణము
ఆరు పదుల పోరాట ఫలితము తెలంగాణము
(2) (విశాల)
-జయంతి వాసరచెట్ల , 99855 25355