కాంక్రీటు గుండెలు
అదిగో మేఘ గర్జన ఉరుముల మెరుపుల తాళపు జతుల గతులతో తనను తాను మధించుకుంటున్న వాన చుక్క తొలిచినుకు ధరణి పొత్తిళ్ళ ఒదిగి మట్టి గుబాళింపుల పులకరించాలని
అదిగో మేఘ గర్జన
ఉరుముల మెరుపుల
తాళపు జతుల గతులతో
తనను తాను మధించుకుంటున్న వాన చుక్క
తొలిచినుకు ధరణి పొత్తిళ్ళ ఒదిగి
మట్టి గుబాళింపుల పులకరించాలని
మలిచినుకు భూ వేదికపై
తకిట తకధిమి చప్పుళ్ళ
నాట్య భంగిమల పరవశించాలని
ప్రాణికోటి జీవనాధారమై
నీటి జాడల మానవ నాగరికతకు పునాదియై
మత్తళ్ళ దుంకి పాడిపంటల
పసిడి బంగారమై పరిఢవిల్లాలని
చిత్తడి చిత్తడిగా మట్టి వాసనలను
అందుకోవాలని
ఉరికురికి ఉబికుబికి వచ్చింది వానచుక్క
పరచుకున్న కాంక్రీట్ గుండెల్ని చూసి
బిత్తర పోయింది
మట్టి అంటకుండా తిరగాడుతున్న
మట్టి దేహాలను చూసి చిత్తరువయ్యింది
ఎత్తయిన మేడలు ఇరుకైన సందులు
వాకిళ్లు లోగిళ్లు రహదారులు మైదానాలు సిమెంట్ పూతల ఇన్కలేనితనం
ప్లాస్టిక్ గుట్టల కరుగనితనం
మొండి చేతుల ఆహ్వానం
మోడవుతున్న చెమ్మతనం
ఇన్కలేక ఇమడలేక వెతికి వెతికి చిత్తి చిత్తి
ఆవిరవుతున్నవేళ ఓ గుండె
ఇంకుడుగుంతై ఆహ్వానించింది
జీవనాధారమై మానవత్వాన్ని చాటింది.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- Dharani
- gold
- Lightning
- literature
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

