విత్తనం
సహన లేపనం పూసుకున్న అంతుచిక్కని పురాతన మాతృక అస్తిత్వం కోల్పోకుండా చిత్తు అనుకోలేని విత్తు పరిమళభరిత భవిష్యత్తు తరాల పతాకానికి తొలిమెట్టు
సహన లేపనం పూసుకున్న
అంతుచిక్కని పురాతన మాతృక
అస్తిత్వం కోల్పోకుండా చిత్తు అనుకోలేని విత్తు
పరిమళభరిత భవిష్యత్తు తరాల పతాకానికి తొలిమెట్టు
నీటిస్పర్శతో ఆలింగనం కాబడి
విత్తుగా ఎత్తుకు ఎదిగి ఒదుగుతూ…
వేర్లను రెక్కలుగా చాచుతూ…
పొరలు పొరలుగా చీల్చుకుంటూ…
కొమ్మలు రెమ్మలుగా పెరుగుతూ ఉంటుంది
ఆకుపచ్చని చెట్టుగా అవని అంతా పరుచుకొని
ఔషధ గుణాలతో పువ్వులు ఫలాలుగా
ఇంటి అవసరాల కల్ప తరువులుగా
ఇంటిల్లి పాదికి డెకరేషన్లో మేటిగా
పెరట్లో తులసి మొక్కగా
ఆఖరి మజిలీలో దేహంపై పాడెగా కాల్చే కట్టెగా
చల్లనిరేయిలో..హాయిని ప్రసాదించి
అవిశ్రాంత పసిడి అన్నపూర్ణ దాతువు
విత్తనం వినీలాకాశముగా
వినయంతో విజయ శిఖరముగా
ప్రకృతిని సృష్టించిన ఆణిముత్య వనకణం
– డాక్టర్ పగిడిపల్లి సురేందర్ 80748 46063
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

