నారింజ రంగు బొట్టెట్టుకుని,
కురుల కిరణాలను సవరించుకుంటూ
ప్రభాత సమయంలో ముస్తాబైన నింగిలా కనిపిస్తావు
నల్లమబ్బు ముసిరిన మధ్యాహ్న తీరంలో,
పరధ్యానంగా నడుస్తున్నప్పుడు,
కడలిలా మారి అలల పెదాలతో ముద్దాడి పలకరిస్తావు..
గోధూళి వేళ,
సమూహాలన్నీ ఒంటరితనాన్ని మోస్తున్నప్పుడు,
ఒంటరినైన నాలో,
అనేక భావాల సమూహమై సంభాషిస్తావు…
కలలా వస్తావనుకున్న రాత్రి,
కునుకును వారించి, రెప్పలపై వాలి…
రెండో జాము చివర్లో, గతాన్ని నిమురుతూ,
జలపాతాల్ని ఒలికిస్తావు.
– జాబేర్ పాషా మస్కట్ (ఒమన్) 00968 78531638