ప్రేమోన్మాదం
ప్రేమకు ఉన్మాదానికి మధ్య హద్దు చెరిపేసి మనసులేని మనుషులు కత్తితో ప్రేమ
ప్రేమకు ఉన్మాదానికి మధ్య హద్దు చెరిపేసి
మనసులేని మనుషులు కత్తితో ప్రేమ
సామ్రాజ్యాన్ని జయించొచ్చని కలలు
కంటున్నారు..
ఏ మారణాయుధం ప్రేమను సాధించి
జయకేతనం ఎగరేసింది?
అభాగినుల రక్తంతో నడిరోడ్డూ కేన్వాసుపై
వికృత వాంఛల్ని గీయటం తప్ప!
ప్రేమంటే అందమైన మాంసపు ముద్దను
సొంతం చేసుకొనే పౌరుషం కాదే
ఆ ముద్ద వెనుక ముగ్ధరాలి మనసెరిగి
నడుచుకునే త్యాగశీలత కదా!
మగతనమంటే వెంటపడి వేధించే పీడకల కాదే!
అందానికి మనసుంటుందని గుర్తించే
సామాజిక సంస్కారం కదా!
రేపొక ఇంటిని వెలిగించే దీపాన్ని
కత్తికొక ప్రేమగా ఆర్పేస్తుంటే
ప్రతి అందం వెనుక తార్లాడే మృత్యునీడల్ని
ఎప్పటికీ తప్పించలేమా!
పట్టపగలు నడిరోడ్డులో నలుగురిలో
ఆడది..
రక్షించలేకపోతున్నాం!
మహాత్ముడు చెప్పిన అర్ధరాత్రి ఆడది
ఒంటరిది.. క్షేమంగా ఇల్లు చేరేదెప్పుడు?
(ప్రేమ పేరుతో స్త్రీలపై జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా)
భీమవరపు పురుషోత్తమ్
99498 00253
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

