HomeLifestyleYoutuber Interviews Get Inspired By The Success Stories
ఇంటి ముచ్చట్లు
వంటలో ఒక్కో ఇంటిది ఒక్కో అభిరుచి. ఇంకా చెప్పాలంటే ఒక్కో చేతిది ఒక్కో రుచి. సౌందర్య పోషణ కూడా అంతే,
వంటలో ఒక్కో ఇంటిది ఒక్కో అభిరుచి. ఇంకా చెప్పాలంటే ఒక్కో చేతిది ఒక్కో రుచి. సౌందర్య పోషణ కూడా అంతే, ఒకొక్కరిదీ ఒక్కో పంథా. ఇల్లు సర్దుకోవడమూ అందరూ ఒకేలా చేయలేరు. అందుకే తనకు తెలిసిన వంటలు, సౌందర్య చిట్కాలు, ఇంటి ఆర్గనైజింగ్లాంటివి వీక్షకులతో పంచుకునేందుకు ‘మన ఇంటి టిప్స్’ పేరిట యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన కళ్యాణి. అందులో తన రోజువారీ జీవితాన్ని చూపుతూనే తనకు తెలిసిన రకరకాల విషయాలను పంచుకుంటారామె.
మేకప్ వేసుకోవడం అప్పుడే నేర్చుకుంటున్నవారి కోసం మేకప్ ఫర్ బిగినర్స్లాంటి వీడియోలతోపాటు ఫేషియళ్లూ, ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లో చేసుకోవడం ఎలాగో చూపుతున్నారు. షాపింగ్ వీడియోలనూ వీక్షకులతో పంచుకుంటారు కళ్యాణి. తను పీసీఓడీని జయించి సాధారణంగా ఎలా గర్భం ధరించారో చెబుతూ చేసిన వీడియోల సిరీస్‌కీ మంచి స్పందన వచ్చింది. తన అత్తగారూ, ఆడబిడ్డలతో కలిసి ఆమె చేసే వీడియోలు ఇంటింటా కనిపించే ముచ్చట్లను యాదిచేస్తాయి.